కరోనా వైరస్ ఏమో గానీ ఎంతో సంబరంగా జరుపుకోవాలి అనుకున్న వేడుకలను సైతం నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ కరోనా వ్యాప్తిచెందకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు పెళ్లిళ్లు,పేరంటకాలను నిర్వహించుకోకూడదు అంటూ ఆదేశాలు కూడా జారీ చేశాయి.
దీనితో చాలా మంది శుభకార్యాలను వాయిదా వేసుకుంటుండగా,మరికొంత మంది తప్పని సరి పరిస్థితుల్లో జరుపుకోవాల్సి వస్తుంది.అయితే అలాంటి పరిస్థితి లోనే ఖమ్మం జిల్లా లో ఒక వివాహవేడుకను నిర్వహించనున్నారు.
అయితే ఈ పెళ్ళికి రావొద్దు అంటూ ఆ వధువు తండ్రి అందర్నీ విన్నవించుకునే పరిస్థితి ఏర్పడింది.అదేంటి.
ఎవరైనా పెళ్లికి వచ్చి నాలుగు అక్షింతలు వేసి ఆశీర్వదించమని కోరతారు.కానీ కరోనా వైరస్ దెబ్బకు ఇలాంటి పిలుపులు కూడా వినాల్సి వస్తుంది జనాలు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసే వివాహాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.ఇప్పటికే ముహుర్తాలను ఖరారు చేసుకున్న వారు 200 మంది అతిథులకు మించకుండా పెళ్లిళ్లు చేసుకోవాలని ఆదేశించింది.
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు సైతం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ప్రభుత్వం ఇంత స్ట్రిక్టుగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది లెక్కచేయకుండా 200 మంది కంటే ఎక్కువ మంది అతిథులతో పెళ్లిళ్లు చేసుకున్నారు.
దీనితో ఈ ఫంక్షన్ హాల్స్‌ను సీజ్ చేసినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఇప్పటికే పలు గార్డెన్లు, ఫంక్షన్ హాల్స్‌ను సీజ్ చేసింది.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ముదిరెడ్డి వీరారెడ్డి, స్వరూప దంపతులు తమ కూతురు శ్రావ్య వివాహాం ఖమ్మం జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో చేసేందుకు నిశ్చయించారు.అయితే కరోనా నివారణలో భాగంగా అన్ని ఫంక్షన్ హాల్స్ మూసేసిన కారణంగా తమ కూతురు వివాహం జరిగే ఫంక్షన్ హాల్‌కు ఎవరూ రావొద్దంటూ ఆయన విన్నవించుకోవాల్సి వచ్చింది.
అయితే కరోనా దెబ్బకు ఇలాంటి అహ్వానాలను కూడా అందుకోవాల్సి వస్తుందంటూ పలువురు చమత్కరించుకుంటున్నారు.