పవన్ 'రాజకీయం' గందరగోళంలోనే ఉందా ?  

The Leaders Still Going Out From Janasena-chiranjeevi,janasena,pawan Kalyan Janasena,satyanarayana Janasena,telangana Congress,ys Jagan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ఒక్కమాటలో చెప్పలేము.ఆయన సినిమాల నుంచి విరమించుకున్నాని ప్రకటించినా ఆయన అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గడంలేదు.

The Leaders Still Going Out From Janasena-chiranjeevi,janasena,pawan Kalyan Janasena,satyanarayana Janasena,telangana Congress,ys Jagan-The Leaders Still Going Out From Janasena-Chiranjeevi Janasena Pawan Kalyan Janasena Satyanarayana Telangana Congress Ys Jagan

ఇక ఆయన ఎక్కడ ఏ పర్యటనకు వెళ్లినా లక్షలాదిమంది అభిమానులు అక్కడకి క్యూ కట్టేస్తుంటారు.సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఇక ఎవ్వరికి లేదనే చెప్పాలి.అంత పాపులారిటీ ఉన్నా రాజకీయాల్లో మాత్రం పవన్ ప్లాప్ అయ్యాడనే చెప్పాలి.ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందడంతో పాటు రెండు పార్టీల మద్దతు పోటీ చేసి ఒక్క సీటుతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

The Leaders Still Going Out From Janasena-chiranjeevi,janasena,pawan Kalyan Janasena,satyanarayana Janasena,telangana Congress,ys Jagan-The Leaders Still Going Out From Janasena-Chiranjeevi Janasena Pawan Kalyan Janasena Satyanarayana Telangana Congress Ys Jagan

ఎన్నికల ముందు పవన్ చెప్పిన దానిని బట్టి చూస్తే తనది పాతికేళ్ళ పార్టీ అని, తన రాజకీయ పయనం కూడా సుదీర్ఘమైనదని చెప్పుకొచ్చారు.కానీ ఆ దిశగా పార్టీని నడిపించలేకపోతున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి.

పార్టీలో పవన్ వన్ మ్యాన్ షో తప్ప మరేమి కనిపించడంలేదు అన్న విమర్శలు రోజు రోజుకి ఎక్కువయిపోతున్నాయి.

ప్రాంతీ పార్టీల గురించి చెప్పుకుంటే ప్రాంతీయ పార్టీలు పెడితే తొలిసారిలోనే అధికారంలోకి రావాలి.లేకపోతే మనుగడ ఉండదు అనే విషయాన్ని రాజకీయ పండితులు చెబుతూ ఉంటారు.కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటిసరి ఎన్నికల్లో ఫెయిల్ అయినా కష్టపడి రెండోసారి అధికారంలోకి వచ్చింది.

దానికి పార్టీ పటిష్టంగా ఉండడం, వైఎస్సార్ ఇమేజ్, జగన్ రెక్కల కష్టం.జనం నమ్మకం ఇలా అనేక పరిస్థితులు అనుకూలంగా మారాయి.అర్ధబలం, అంగబలం జగన్ కి ఎక్కువగా ఉన్నాయి.పట్టుదల అన్నిటి కంటే ఎక్కువగా కనిపించేది.రాజకీయంగా తనను ఎన్నిరకాలుగా వేధింపులకు గురిచేసినా ఆయన మొండిగానే ముందుకు వెళ్లాడు.కానీ పవన్ లో అటువంటి రాజకీయ లక్షణాలు ఎక్కడా కనిపించడంలేదు.

పవన్ చేస్తున్నవన్నీ పార్ట్ టైం పాలిటిక్స్ గానే అంతా భావిస్తున్నారు.అదీ కాకుండా జనసేనలో ఇపుడు వరసగా నాయకులు వెళ్ళిపోతున్నారు.రాజమండ్రికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనకు రాజీనామా చేసి ఒక్కరోజు కూడా పూర్తవ్వకుండానే విశాఖ జిల్లా గాజువాకకు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య పార్టీని వీడారు.ఈ ఇద్దరూ పవన్ కళ్యాణ్ సొంత సామాజికవర్గం నాయకులే.వీరే కాకుండా జనసేన పార్టీలో ఉన్న నాయకుల్లో చాలామందికి రాజకీయంగా అభద్రతా భావం పెరిగిపోతోంది.

పవన్ అప్పుడప్పుడు హడావుడి చేయడం, ఎక్కువగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతుండడం చాలా మంది నేతలకు రుచించడంలేదట.ప్రస్తుతం టీడీపీ బలహీన పడుతున్న ఈ సందర్భంలో జనసేన రాజకీయంగా పుంజుకోవాల్సి ఉండగా ఒక్కో నేత దూరం అవుతూ వస్తుండడం ఆ పార్టీలోని గందరగోళ పరిస్థితిని తెలియజేస్తోంది.