టీఆర్ఎస్‌లో సైలెంట్ అయిన ఆ వ‌ర్గం నేత‌లు.. కార‌ణ‌మేంది..?

టీఆర్ఎస్ పార్టీ అంటే ఒకప్పుడు ఉద్య‌మ పార్టీగా ఉంది.ఆ స‌మ‌యంలో కేసీఆర్ ఒక మాట అంటే ఆ పార్టీలో ఉన్న వారంతా నాలుగు మాట‌లు అనే రేంజ్‌లో ఫైర్ మీద ఉండేవారు.

 The Leaders Of That Category Who Are Silent In Trs  What Is The Reason .., Trs,-TeluguStop.com

కానీ తెలంగాణ వ‌చ్చాక ఎక్కువ‌గా రెడ్డి వ‌ర్గానికి చెందిన నేత‌లే ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.ముఖ్యంగా ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కువ‌గా ప్ర‌తిప‌క్షాల‌ను చెడుగుడు ఆడుకునే ఫైర్ బ్రాండ్లుగా రెడ్డి నేత‌లు క‌నిపించేవారు.

అయితే ఏమైందో ఏమోగానీ ఈ న‌డుమ అస‌లు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్డి వ‌ర్గానికి చెందిన నేత‌లంగా సైలెంట్ గానే ఉంటున్నారు.

దీనికి కార‌ణాలు ఏమైనా కూడా ఇది టీఆర్ఎస్‌పార్టీకి పెద్ద న‌ష్ట‌మ‌నే చెప్పాలి.

ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు పుంజ‌కుంటున్న స‌మ‌యంలో టీఆర్ ఎస్‌లో ఫైర్‌బ్రాండ్లు సైలెంట్ కావ‌డం విమ‌ర్శ‌ల‌ను, ఆరోప‌న‌ల‌ను తిప్పి కొట్ట‌డంలో మౌనం వ‌హించ‌డం పెద్ద న‌ష్ట‌మ‌నే చెప్పాలి.నిజానికి ఏపీలో కేవ‌లం వైసీపీలోనే రెడ్డి వ‌ర్గం బ‌లంగా ఉంది.

కానీ ఇటు తెలంగాణ‌లో చూస్తే అన్ని పార్టీల్లోనూ రెడ్డి నేత‌లు బ‌లంగానే ఉన్నారు.అందుకే వారిమ‌ధ్య ఢీ అంటే ఢీ అనేంత‌లా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.

అయితే అటు కాంగ్రెస్‌లో, బీజ‌పీలో ఈ వ‌ర్గం బాగానే మాట్లాడుతోంది.

Telugu Congress, Tg, Category Trs, Ts-Telugu Political News

ఎటొచ్చి టీఆర్ఎస్‌లో ఒక‌ప్పుడు ఫైర్ బ్రాండ్లుగా ఉన్న వారంతా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు.ఇక్క‌డే కొన్ని అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి.ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి అయ్యాక‌నే టీఆర్ ఎస్‌లో వీరంతా సైలెంట్ అయ్యారు.ఒక‌ప్పుడు టీడీపీ, కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి నేత‌లు ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు.

అంటే అప్ప‌టి నుంచే వీరికి రేవంత్ తో స‌న్నిహిత్యం ఉండ‌టంతో వారంతా మౌనంగా ఉండ‌టానికి రేవంత్ ఏమైనా కార‌ణ‌మా అనే అనుమానాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.కార‌ణాలు ఏమైనా కూడా ఇలా వీరంతా ఏక‌ధాటిగా టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వ‌డం పెద్ద అల‌జ‌డి రేపుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube