సినీ ఇండస్ట్రీలో సరికొత్త్ ట్రెండ్.. అలా చేస్తే విడాకులు తీసుకున్నట్టే?

గత కొద్ది రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో విడాకుల విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే ప్రతిరోజు ఏదో ఒక జంట విడిపోతున్నారంటూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ విడాకుల విషయం పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 The Latest Trend In Film Industry They Do Surely Divorced Details, New Trens, Film Industry, Social Media, Name Changes, Divorced, Social Media, Name Change, Samantha Naga Chaitanya, Srija Kalyan Dev, Priyanka Chopra, Ameer Khan, Dhanush Aishwarya-TeluguStop.com

ఈ క్రమంలోనే గత ఏడాది బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ దంపతులు విడాకులు ప్రకటించగా టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ సమంత నాగచైతన్య కూడా విడాకులు గురించి తెలియజేశారు.ఇదిలా ఉండగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు.

అయితే వీరందరూ కూడా మొదట్లో తమ సోషల్ మీడియా అకౌంట్లలో తన భర్త పేరును తొలగిస్తూ విడాకులు తీసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చారు.ఇలా హింట్ ఇచ్చిన విధంగానే సమంత నాగచైతన్య దంపతులు విడిపోయారు.

 The Latest Trend In Film Industry They Do Surely Divorced Details, New Trens, Film Industry, Social Media, Name Changes, Divorced, Social Media, Name Change, Samantha Naga Chaitanya, Srija Kalyan Dev, Priyanka Chopra, Ameer Khan, Dhanush Aishwarya-సినీ ఇండస్ట్రీలో సరికొత్త్ ట్రెండ్.. అలా చేస్తే విడాకులు తీసుకున్నట్టే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత అక్కినేని అని పేరు పెట్టుకున్న సమంత నాగ చైతన్య తో మనస్పర్ధలు వచ్చిన తర్వాత అక్కినేని పేరును తొలగించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కూడా ఇదే విషయం వార్తల్లో నిలిచింది.

Telugu Ameer Khan, Divorced, Change, Trens, Priyanka Chopra, Samanthanaga-Movie

ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ఖాతాలలో తన భర్త పేరును తొలగించడంతో వీరిద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో స్వయంగా ప్రియాంక చోప్రా కల్పించుకొని అలాంటిది ఏమి లేదని కొట్టిపారేసింది.ఇకపోతే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ పేరును తన సోషల్ మీడియా ఖాతాలలో పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే శ్రీజ తన భర్త పేరును తీసేసి కేవలం శ్రీజ కొణిదల అని పెట్టుకోవడంతో వీరిద్దరూ కూడా విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి సరికొత్త ట్రెండ్ రన్ అవుతుంది.

ఎవరైతే సోషల్ మీడియా ఖాతాలలో తన భర్త పేరు తొలగిస్తారో వారు విడాకులు తీసుకోబోతున్నట్లని నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube