మృతులను కూడా సజీవంగా చూపించే సరికొత్త టెక్నాలజీ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

వంశ వృక్షాన్ని రూపొందించే ఒక ప్రముఖ హెరిటేజ్ వెబ్సైట్ డీప్ ఫేక్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.ఈ టెక్నాలజీతో చనిపోయిన వ్యక్తుల మొహాలలో కదలికలు సృష్టించవచ్చు.

 The Latest Technology To Show The Dead Alive Netizens Wondering-TeluguStop.com

అయితే వంశ వృక్షాన్ని రూపొందించే ఈ వెబ్సైట్ ప్రజలు చనిపోయిన తమ బంధువులను డీప్ ఫేక్ టెక్నాలజీతో సజీవంగా చూపించవచ్చు అని చెబుతోంది.అయితే ఈ సరికొత్త టెక్నాలజీ టూల్ కి డీప్ నస్టాలాజియా అనే పేరు పెట్టారు.

ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం తమకు ఆందోళన కలిగిస్తోందని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం ఇది మాయాజాలం గా ఉందని అంటున్నారు.

 The Latest Technology To Show The Dead Alive Netizens Wondering-మృతులను కూడా సజీవంగా చూపించే సరికొత్త టెక్నాలజీ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఫేక్ వ్యక్తులను సృష్టించే ప్రమాదం ఉంది.

దీనివల్ల ఊహించని నేరాలు కూడా జరగవచ్చు.అందుకే ఇటువంటి టెక్నాలజీపై ఒక చట్టం తీసుకురావాలని బ్రిటన్ ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటుంది.

ఈ క్రమంలోనే హెరిటేజ్ వెబ్సైట్ డీప్ ఫేక్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.అయితే ఈ డీప్ ఫేక్ టూల్ తో కేవలం చిత్రాలను మాత్రమే ఫేక్ చేయగలమని స్పీచ్ యాడ్ చేసే వెసులుబాటు కల్పించడం లేదని హెరిటేజ్ కంపెనీ చెబుతోంది.

దీనివల్ల ఈ టెక్నాలజీ ని ఎవరూ కూడా దుర్వినియోగం చేసుకునే ప్రమాదం ఉండదని ఆ కంపెనీ చెబుతోంది.

పాత జ్ఞాపకాలకు ఒక మంచి రూపం తీసుకు వచ్చే ఉద్దేశంతో మేము ఈ టెక్నాలజీ రూపొందించాం.

ఒకరి అంగీకారం లేకుండా డీప్ ఫేక్ వీడియోలు చేసి వాటికి స్పీచ్ జత చేయడం చట్ట విరుద్ధం కాబట్టే స్పీచ్ ను చేర్చలేదని ఆ వెబ్సైటు చెబుతోంది.ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సహాయం తో కంప్యూటర్ లో వీడియోలను సృష్టించే వాటిని డీప్ ఫేక్ అని అంటుంటారు.

ఈ వీడియోలను నిజమైన మనుషుల ఫోటోలు ఉపయోగించి సృష్టిస్తారు.ఇజ్రాయెల్ కంపెనీ కనిపెట్టిన ఈ టెక్నాలజీ తో ప్రజల ముఖాలు, వారి భావాలను మార్చి సహజత్వానికి చాలా దగ్గరగా వీడియోలు రూపొందించవచ్చు.

అయితే మై హెరిటేజ్ వెబ్సైట్ లో క్వీన్ విక్టోరియా వంటి ప్రముఖుల ఫేక్ వీడియోలను సృష్టించారు.పుట్టినరోజు సందర్భంగా అబ్రహం లింకన్ ఫేక్ వీడియో కూడా సృష్టించి యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు.

#Show #Dead #Netizens #Wondering #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు