సొంత ఇలాకలో జగన్ ని దెబ్బ కొట్టడానికి ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త నినాదం..!!

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను ముప్పుతిప్పలు పెట్టడానికి ప్రతిపక్షాలు దొరికిన ఛాన్స్ ఏది కూడా వదులుకోవడం లేదు.జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి యే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉంచాలని ఇప్పటికే ఆ ప్రాంతాలలో ఆందోళనలు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

 Ysrcp,ys Jagan,amaravathi,rayalaseema,ex Mp Gangula Prathap Reddy, Ys Jagan, Gre-TeluguStop.com

మరో పక్క రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసంపై మత రాజకీయాలను కేంద్రం చేసుకొని వైసిపి పార్టీని ఇరకాటంలో పెట్టే రీతిలో మరోపక్క అడుగులు వేస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో జగన్ సొంత ఇలాకాలో గట్టిగా దెబ్బ కొట్టడానికి ప్రతిపక్షాలు రెడీ అవుతున్నట్లు ఇందుకోసం సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.మేటర్ లోకి వెళితే రాయలసీమలో మొదటి నుండి జగన్ పార్టీకి తిరుగులేని ఓటుబ్యాంకు ఉంది అన్న సంగతి తెలిసిందే.2014 అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైసిపి పార్టీ అత్యధికంగా రాయలసీమలో గెలుస్తూ వస్తుంది.ఇటువంటి తరుణంలో సొంత ఇలాకాలో జగన్ ని ఇరకాటంలో పెట్టే రీతిలో ప్రతిపక్షాలు ఇప్పుడు “గ్రేటర్ రాయలసీమ” అనే నినాదాన్ని తెర పైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాయలసీమ ప్రాంతంలో ఉన్న నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాని  కలిపి “గ్రేటర్ రాయలసీమగా” గుర్తించాలని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి తాజాగా డిమాండ్ చేస్తున్నారు.

ఇందుకోసం త్వరలోనే రాయలసీమ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులతో భేటీ అయ్యి సరికొత్త ఉద్యమాన్ని స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.ఇదిలా ఉంటే ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, వైసిపి కి రాష్ట్రంలో ఉన్న ఆదరణను అనగా దోక్కడానికి ప్రతిపక్షాలు చేస్తున్న డ్రామా అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

ఏది ఏమైనా గ్రేటర్ రాయలసీమ అనే కొత్త నినాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తెరపైకి రావడం సరికొత్త చర్చకు తావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube