దేశాలు,ప్రాంతాలు వేరైనా ఎక్కడైనా కోడి ఒక పద్దతి పాటిస్తుంది.కోడి అంటే పొద్దున్నే కూస్తుంది,అలానే గుడ్లు పెట్టడం ఇవన్నీ కామం.
కోడి అనేది వెనుక భాగం నుంచి గుడ్లు పెడుతుంది అన్న విషయం తెలిసిందనే.కానీ కర్ణాటక లో మాత్రం ఒక కోడి వింతగా గుడ్లు పెడుతుంది.
మరి రొటీన్ కు భిన్నంగా ఉంటుంది అని ఇలా పెడుతుందా మరేమి కారణమో తెలియదు కానీ మెడ కింద భాగం నుంచి గుడ్డు పెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.కర్ణాటక లోని మండ్యల లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… శివరామె గౌడ అనే వ్యక్తి రెండేళ్లుగా కోడిపెట్టను పెంచుకుంటున్నాడు.అయితే అది ఒక రోజు ఉన్నట్టుండి గుడ్డు పెట్టిన తీరు చూసి ఆశ్చర్యపోయాడు.
గుడ్డు పెడితే ఆశ్చర్యపోవడానికి ఏమి ఉంటుంది.కానీ అక్కడ అదే ఆశ్చర్యం ఆ కోడి వెనుక భాగం నుంచి కాకుండా మెడ కింద భాగం నుంచి గుడ్డును పెట్టింది.
అంతే ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ యజమాని వెంటనే దాన్ని వీడియో తీసి మరీ సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.
ఈ కోడిని చూసిన నెటిజన్స్ నిజామా.? అని ఆశ్చర్యపోతూ షేర్లు మీద షేర్లు చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది.ఇది చూసిన స్థానికులు ఇదెలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరి నిజంగా ఇలా కూడా కోళ్లు గుడ్లు పెడతాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది.