వాట్సాప్ నుంచి అదిరిపోయే సరికొత్త ఫీచర్..!

ప్రతి ఒక్కరు ఉపయోగించే యాప్ ఏదన్నా ఉంది అంటే అది వాట్సాప్ అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఈ క్రమంలోనే రోజుకో సరికొత్త ఫీచర్స్ తో మనకు ఇంకా దగ్గరవుతుంది.

 The Latest Feature To Be Removed From Whatsapp-TeluguStop.com

ఇప్పుడు కూడా మరొక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.అదేంటంటే ఇప్పటి వరకూ ఫేస్ బుక్ లో మాత్రమే వాయీస్ రికార్డ్ చేసి పంపించే ఫీచర్ అందుబాటులో ఉండేది కానీ ఇప్పుడు సరిగా అదే వాయిస్ ఫీచర్ వాట్సప్ లో కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే వాయిస్ రికార్డింగ్ ను పాస్ చేసి మళ్లీ రికార్డ్ అయ్యాక తిరిగి పంపుకోవచ్చు అన్నమాట.ఈ వాయిస్ ఫిచర్ అనేదిబీటా ఐఓఎస్, యాండ్రాయిడ్ ప్లాట్ ఫాంలలో మాత్రమే రిలీజ్ చేయనున్నారు.

 The Latest Feature To Be Removed From Whatsapp-వాట్సాప్ నుంచి అదిరిపోయే సరికొత్త ఫీచర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మేర WABetainfo ఒక ప్రకటన జారీ చేసింది.అయితే ఈ ఫీచర్ కోసం కొన్ని రోజులు వేచి చుడాలిసిందే.ఎందుకంటే. ఈ ఫీచర్ ఓన్లీ పబ్లిక్ బీటా టెస్టర్లకు అందుబాటులో లేదు.

టెస్టింగ్ తర్వాత మాత్రమే ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది అప్పటిదాకా అందరు వేచి చూడాలి అని ప్రకటనలో తెలిపింది.అయితే ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలంటే ముందుగా వాయీస్ మెసేజ్ రికార్డ్ చేయాలంటే ఒక బటన్ ప్రెస్ చేయాలి.

అలాగే వాయిస్ మెసేజ్ పాస్ చేయడానికి ఒక బటన్, ఒకవేళ దానిని రెజ్యూమ్ చేయాలంటే మరొక బటన్ కూడా ఉంటుంది.అంతేకాకుండా మెసేజ్ డిలీట్ చేయాలన్న సెండ్ బటన్స్ కూడా ఉపయోగించి ఆడియో మెసేజ్ ను ఆపరేట్ చేయొచ్చట.అలాగే మరొక కొత్త ఫీచర్ కూడా త్వరలో రానుంది.అదేంటంటే వాట్సప్ కమ్యూనిటీ గ్రూప్ ఫీచర్.ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా కొన్ని గ్రూప్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చని WABeta వెల్లడించింది.అయితే ఈ గ్రూప్ కు కూడా ఒక అడ్మిన్ ఉంటాడు.

ఆ అడ్మిన్ ను కమ్యూనిటి మేనేజర్స్ అని పిలుస్తారట.ఈ ఫీచర్ ద్వారా ఒకే సమాచారాన్ని ఎక్కువ మందితో పంచుకోవచ్చు.

#Instant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు