కాంగ్రెస్ లో సరికొత్త పరిణామాలు...అసలు కారణం ఇదేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకప్పటితో పోలిస్తే ఎంతో కొంత బలపడిందనే చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం ఇటు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.

 The Latest Developments With Unity In  Congress Is This The Real Reason Details,-TeluguStop.com

ఇటు కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఐక్యంగా పోరాడితే ఎంతో కొంత ప్రజల్లో కాస్త గుర్తింపు వస్తుందనే ఆశతో సగటు కార్యకర్త ఎప్పటి నుండో వ్యక్తం చేస్తున్న ఆవేదన ఇది.అయితే కార్యకర్తల ఆవేదనకు ఇన్నాళ్ల కు కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు.అయితే కాంగ్రెస్ లో ఉప్పునిప్పులా మారిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి కలసి ధర్నాలో పాల్గొని ఒక్కటిగా ప్రభుత్వంపై తమ గళాన్ని వినిపించారు.

అయితే ఈ ధర్నాలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ చాలా అన్యోన్యంగా మెలగటం అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు.

అయితే కాంగ్రెస్ లో జరిగిన ఈ ఆసక్తికర పరిణామంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఖుషీ అవడమే కాకుండా భవిష్యత్ పై పెట్టుకున్న ఆశలు చిగురించిన పరిస్థితి ఉంది.అయితే ఇలా కాంగ్రెస్ నాయకులు కలసి కట్టుగా ఉంటేనే కాంగ్రెస్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Telugu @revanth_anumula, Komatireddy, Komati Venakt, Revanth Reddy, Senior, Tela

అయితే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెడితే కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఇతర పార్టీలకు చోటు ఉండకుండా కాంగ్రెస్ మరల సదరు నియోజకవర్గాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే పరిస్థితి ఉంటుంది.లేకపోతే కాంగ్రెస్ బలంగా లేకపోతే దానిని ఆసరాగా ఇతర పార్టీలు కాంగ్రెస్ ను రెండో స్థానానికి నెట్టే అవకాశం ఉందనేది చాలా మంది ప్రముఖుల అభిప్రాయం.ఇలా సరికొత్త పరిణామాలతో ఒక్కటిగా ఉన్న సంకేతం ఇవ్వడం కోసం అంతేకాక కాంగ్రెస్ కూడా అధికార కైవసమె లక్ష్యంగా ముందుకు సాగుతున్నదనే సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube