కాంగ్రెస్ లో సరికొత్త పరిణామాలు.. కలనా.. నిజమా

The Latest Developments In The Congress Really

తెలంగాణ కాంగ్రెస్ లో చాలా విపత్కర పరిణామాలు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.కలహాల పార్టీగా పేరొందిన  కాంగ్రెస్ లో ఐక్యరాగం వినిపించడం రాజకీయ విశ్లేషకులనే కాదు ఇతర పార్టీల వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది.

 The Latest Developments In The Congress Really-TeluguStop.com

అయితే ఎన్నడూ లేని విధంగా అందరం రేవంత్ ఆధ్వర్యంలో నడుస్తామని రేవంత్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వీహెచ్ లాంటి నేతలు బహిరంగంగా మీడియా ముఖంగా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

అంతేకాక ఇటీవల ఇందిరా పార్క్ లో జరిగిన రైతు ధర్నాలో ఉప్పు నిప్పులా ఉండే కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి అత్యంత అన్యోన్యంగా కలిసిపోవడంతో తెర వెనుక ఏదో భారీ మంత్రాంగం జరిగి ఉండవచ్చు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

 The Latest Developments In The Congress Really-కాంగ్రెస్ లో సరికొత్త పరిణామాలు… కలనా.. నిజమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ తరహా ఘటనలు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది కలనా నిజమా అన్న రీతిలో చర్చ జరుగుతుందట.అయితే దీని వెనుక సోనియా గాంధీ హస్తం ఉన్నట్లు ఒక వాదన బలంగా వినిపిస్తోంది.

వచ్చే రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటికీ ఇంకా పార్టీలో కలహాలు ఉంటే పార్టీ బలపడటం చాలా కష్టమనే భావన సోనియా గాంధీ వ్యక్తం చేయడంతో ఇక చాలా వరకు నేతలు కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

Telugu @revanth_anumula, Komativenkat, Revanth Reddy, Soniya Ghandhi, Telangana, Ts Congress, Varideesha-Political

అయితే ఎందుకంటే చాలా వరకు నేతలు క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల వెంట నడిచి వారితో కలసి నేతలు పోరాడితేనే ప్రభుత్వ వ్యతిరేక కాంగ్రెస్ పోరాటం అనేది ప్రజల్లోకి వెళ్తుంది.లేకుంటే రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి మాత్రమే పరిమితమైతే కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు.ఏది ఏమైనా కాంగ్రెస్ లో ఒక ఐక్య రాగం వినిపించడం శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు.

#Telangana #Varideesha #Revanth Reddy #Komati Venkat #Soniya Ghandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube