కాంగ్రెస్ లో రేవంత్ పై సరికొత్త చర్చ... అదేంటంటే?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ కీలక మలుపు తిరుగుతున్నాయి.కాంగ్రెస్లో  ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే.

 The Latest Debate On Rewanth In Congress Is That It, Revanth Reddy, Telangana Po-TeluguStop.com

అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ లో ఉన్న వర్గ పేరుతో, ప్రజల్లో మరింత పలుచబడి విషయం తెలిసిందే.అందుకే గత రెండు దఫాలుగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రధానమైన కారణం.

అయితే ఎన్ని రకాలుగా చేంజ్ చేసిన సరే కాంగ్రెస్ మార్పు రాకపోగా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ ను మార్చాలని భావించింది.అందుకే పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న స్థానంలో  కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే.

  కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉన్న నాయకులను వదిలేసి, రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ నేతలు అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.అందుకే రేవంత్ రెడ్డిని పిసిసి ప్రకటించడం వాయిదా వేయటంలో కాంగ్రెస్ సీనియర్ల పాత్ర కీలకంగా ఉందని రేవంత్ రెడ్డి ఓ మీడియా ఛానల్ లో బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదు.ఎందుకంటే కాంగ్రెస్ లో ఎంత మంది సీనియర్ నాయకులు ఉన్నా సరే రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

  అయితే ఇటీవల దళిత గిరిజన దండోరా పేరిట సభలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Telugu @revanth_anumula, Congress Seinor, Jagga, Komati Venakt, Mla Jagga, Telan

  అయితే ఈ సభలలో రేవంత్ అభిమానులు ఒక రేవంత్ రెడ్డి మాట్లాడాలి అనుకోవడం రేవంత్ రెడ్డిని హీరోగా ప్రచారం చేసుకుంటూ ఉండటంతో  కాంగ్రెస్ నాయకులకు విలువ లేకుండా పోతుందని ఇది కరెక్ట్ కాదని జగ్గారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.రేవంత్ తనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, అలా  అనుకూలంగా ఉన్నటువంటి నాయకులనే వెంట పెట్టుకొని ఉండాలని ఇష్టపడుతున్నారని సీనియర్ నేతలు సఖ్యత కోసం రేవంత్ రెడ్డి ఏ మాత్రం కృషి చేయడం లేదని తన దారిలోనే వెళ్తున్నారని జగ్గారెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.మరి రేవంత్ రెడ్డి ఈ విమర్శలపై ఎలా స్పందిస్తాడో అనేటువంటి మనం చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube