బెంగాల్ రాష్ట్రంలో స్టార్ట్ అయిన చివరి దశ పోలింగ్..!!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.మొత్తం ఎనిమిది దశల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్షన్ జరుగుతుండగా ఇప్పటివరకు ఏడు దశల్లో పోలింగ్ పూర్తి కావడం జరిగింది.

 The Last Phase Of Polling Started In The State Of Bengal Bjp, Thrunamul Congress-TeluguStop.com

దీంతో 259 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది.నేడు జరుగుతున్న ఎనిమిదో దశ పోలింగ్.

మొత్తం 35 నియోజకవర్గాలకు జరుగుతూ ఉంది.ఈ క్రమంలో 283 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు.

పరిస్థితి ఇలా ఉండగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్.నేటితో బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్న క్రమంలో మే రెండవ తారీకున ఫలితాలు వెలువడుతున్నాయి.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తత భయంకరంగా ఉండటంతో పోలింగ్ కేంద్రాలలో కరోనా నిబంధనలను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది ఎన్నికల కమిషన్.  ఈ ఎన్నికలలో చాలా పార్టీలు పాల్గొనగా ప్రధాన పోటి తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీ కి మధ్య ఉంది అని సర్వే లు వెల్లడి చేశాయి.

దీంతో ఈ రెండు పార్టీల లో ఏది గెలుస్తుంది అన్నది ఉత్కంఠభరితంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube