అలనాటి అందాల నటి సౌందర్య చివరి ఇంటర్వ్యూ.. చూస్తే కన్నీళ్లొచ్చేస్తాయ్?

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది.12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఎవర్‌గ్రీన్ నటి సౌందర్య.ఈమె అసలు పేరు సౌమ్య.సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకొని, అందుకు తగ్గట్టుగానే మంచి పాత్రల్లో నటించి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించారు సౌందర్య.ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు.అమ్మోరు చిత్రం విజయవంతమవడంతో ఆమె ఇక చదువురు పుల్‌స్టాప్ పెట్టేసి తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు.

 The Last Interview Of The Beauty Actress Soundarya You Cry When You See It,  Sou-TeluguStop.com

ఇకపోతే 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భాజపాకి కూడా ప్రచారం చేశారు సౌందర్య.అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి మనరాష్ట్రం లోని కరీంనగర్‌లో పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో ఆమె బయలుదేరారు.

ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ ఉన్నారు.దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణంలో కుప్పకూలిపోవడంతో ఆమె అక్కడే సజీవ దహనమయ్యారు.

కాగా శ్రీరాములయ్య సినిమాపై సౌందర్య తన అభిప్రాయాలను తాను ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చారు .

Telugu Harikrishna, Interview, Paritala Ravi, Soundary, Soundaryasri, Soundarya

కొత్తగా, విభిన్నంగా ఏదైనా చేస్తే ఆంధ్రా జనాలు ఆదరిస్తారని శ్రీరాములయ్య సినిమా ద్వారా నిరూపించారని సినీ నటి సౌందర్య అన్నారు.మహిళలకందరికీ ఈ చిత్రం నచ్చిందని చెప్పడం తనకెంతో ఆనందాన్నిస్తుందని ఆమె అన్నారు.అంతే కాకుండా తనకు శ్రీరాములయ్య సినిమాలో గడియ గడియల్లోన అనే సాంగ్ నచ్చిందని సౌందర్య తెలిపారు.

ఈ సినిమాలో హరికృష్ణ క్యారెక్టర్‌ చాలా పెద్ద అస్సెట్ అని, శ్రీరాములయ్య అనే పాత్రను అది చాలా ఇన్స్‌పైర్ చేసే విధంగా ఉంటుంది.ప్రజలు కూడా ఆ పాత్రను చాలా బాగా ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు.

అంతేకాకుండా ఈ సినిమాలో తనను, పోలీస్‌ క్యారెక్టర్ టార్చర్‌ చేసేటప్పుడు తన బిడ్డను కాపాడుకోవాలని ఉన్నా.ఏమీ చేయలేని స్థితిలో ఆ క్యారెక్టర్‌ నడుచుకునే విధానం తనను బాగా ఆకట్టుకుందని సౌందర్య తెలిపారు.

ఇదే కాకుండా హరికృష్ణ ప్రమాణ స్వీకారం చేసే సీన్ మరియు క్లైమాక్స్‌ సీన్‌ కూడా తనకు చాలా నచ్చిందని ఆమె అన్నారు.ఫైనల్‌గా చెప్పాలంటే తనకు ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉందని సౌందర్య సంతోషం వ్యక్తం చేశారు.

Telugu Harikrishna, Interview, Paritala Ravi, Soundary, Soundaryasri, Soundarya

దాదాపు 30వేల మంది జనాల మధ్యలో ఒక పాత గెటప్‌ వేసుకొని డైలాగ్ చెప్పడం అనేది చాలా కొత్తగానే కాదు.మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందని ఆమె చెప్పారు.ఆ స్థూపం ఉన్న ప్రదేశంలో దాదాపు 3 రోజుల వరకు షూటింగ్ అక్కడే చేశామని, అదో గొప్ప త్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అని సౌందర్య అన్నారు.దాన్ని మాటల్లో కూడా చెప్పలేమని ఆమె తెలిపారు.

ప్రొడ్యూసర్‌లు కూడా చాలా బాగా చూసుకున్నారని, అనంతపురంలో కూడా సెక్యూరిటీ దగ్గర్నుంచి అందరూ చాలా బాగా ట్రీట్ చేశారని, ఆ విషయంలో పరిటాల రవికి థ్యాంక్స్ చెప్పాలి అని ఆమె అన్నారు.ఇలాంటి విభిన్న కథలున్న సినిమాలు రావాలంటే ప్రేక్షకులు తమను ఇలాగే ఆదరించాలని సౌందర్య విశ్వాసం వ్యక్తం చేశారు.

సౌందర్య. తాను ఈ లోకం నుంచి వెళ్లిపోయినా ఇప్పటికీ ఆమెకు అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు.భౌతికంగా ఆమె అందరికీ దూరమైనా.ప్రజల గుండెల్లో తను నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పుడూ బతికే ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube