ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమా.. రంగు పడాల్సిందే!

మంచి గుర్తింపు పొందిన సినిమాలకు హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డులతో సత్కరిస్తారు.ప్రపంచంలోని అనేక దేశాల నుండి సినిమాలు ఈ అవార్డులను దక్కించేందుకు ప్రయత్నిస్తాయి.

 The Last Color Movie Nominated In Oscars-TeluguStop.com

కానీ కొన్ని సినిమాలకే ఈ అవకాశం దక్కుతుంది.అయితే భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డులు వచ్చిన దాఖలాలు లేవు.

అయితే భారత సినీ చరిత్రలో కేవలం మూడే సినిమాలు టాప్-5 బరిలో నిలిచి నిరాశతో వెనుదిరిగాయి.

అయితే ఈసారి కూడా భారత్ నుంచి ఎవ్వరూ ఊహించని సినిమా ఒకటి ఆస్కార్ బరిలో నిల్చుంది.

ఆస్కార్ కోసం భారత్ తరఫున అఫీషియల్ మూవీగా రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ నటించిన ‘గల్లీ బాయ్’ అనే సినిమాను ఎంపిక చేశారు.అయితే దీంతో ఎవ్వరూ ఊహించని విధంగా ఇప్పుడు మరో సినిమా ఆస్కార్ బరిలో నిల్చుంది.

చెఫ్ నుండి దర్శకుడిగా మారిన వికాస్ ఖన్నా తెరకెక్కించిన ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.ఈ సినిమాను బెస్ట్ ఫీచర్ ఫలిం విభాగంలో ఎంపిక చేసినట్లు చిత్ర దర్శకుడు వికాస్ ఖన్నా తెలిపారు.

ఓ విధవరాలి జీవితాన్ని ఓ 9 ఏళ్ల అమ్మాయి రంగులమయంగా ఎలా మార్చిందనే కథపై తెరకెక్కిన ఈ సినిమా మానవ సంబంధాలను ఆవిష్కృతం చేస్తుంది.ఈ సినిమాలో నీనా గుప్తా ముఖ్య పాత్రలో నటించారు.

మరి ఈ సినిమా ఆస్కార్ అవార్డును దక్కించుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube