టైటానిక్ షిప్‌లా విరిగిపడ్డ కొండచర్య.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

వీకెండ్స్‌లో సరదాగా గడపాలని అనుకుంటారు.కొందరు పర్వతాలపైకి ట్రెక్కింగ్ కోసం వెళితే, మరికొందరూ సరస్సులో బోట్ షికారు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

 The Landslide That Broke Like The Titanic Ship . Should Be A Shock To See, Brazi-TeluguStop.com

ఇలా వెళ్లిన వారు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుంటారు.మరికొందరైతే ప్రమాదాల కారణంగా చనిపోతుంటారు కూడా.

ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం.తాజాగా అలాంటి ఘటనే ఒకటి బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.

గత శనివారం నాడు బ్రెజిల్‌లోని పుర్నాస్ సరస్సులో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.బోట్లలో షికారు చేస్తూ ప్రకృతి అందాలను చూస్తూ సేద తీరుతున్నారు.

అయితే సరస్సులో ఒక భాగంలో పెద్ద కొండ ఉంది.దాని సమీపంలో కొన్ని బోట్లు తిరుగుతుండగా.

ఉన్నట్టుండి కొండచర్యలు విరిగిపడ్డాయి.దీంతో బోట్లు చెల్లాచెదురయ్యాయి.7 మంది పర్యాటకులు అక్కడికక్కడే మృతి చెందారు.మరో 32 మంది త్రీవంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే చిక్సిత తీసుకుంటూ మరో ముగ్గురు చనిపోవడంతో మృతుల సంఖ్య 10కి పెరిగింది.

సమాచారం తెలుసుకున్న రెస్క్వూ టీం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.ప్రమాదంలో మరో ముగ్గురు గల్లంతు అయ్యారు.

వీరి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ప్రమాదానికి సంబంధించిన దృష్యాలను కొంత దూరంలో బోట్లో ఉన్న పర్యాటకులు వీడియో తీశారు.ఒకసారి ఈ వీడియోను చూస్తే.

ఒళ్లు గగుర్పాటుకు గురువుతుంది.పర్యాటకులు సరస్సులో కొండ సమీపానికి వెళ్లినప్పుడు ఒక్కసారిగా కొండచర్య విరిగి పడుతుంది.

దీంతో సరస్సులోని నీరు ఉప్పెనలా ఎగిసిపడ్డాయి.బోట్లు ముక్కముక్కలుగా చెల్లాచెదరుగా పడిపోయాయి.

ఊహించని ఘటనతో పర్యాటకులు షాక్ గురయ్యారు.దీంతో అక్కడ భీతావహపరిస్థితి నెలకొంది.

ఈ ఘటనలో కొందరు పర్యాటకులు చనిపోగా, మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.మరికొంత మంది గల్లంతు అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube