అంతుచిక్కని రహస్యాలకు అడ్రస్ గా మారిన ఆ సరస్సు..!

భూమండలంపై అనేక సరస్సులు, నదులు, గుట్టలు, కొండలు ఉన్నాయి.అయితే ఇప్పటికే చాలా వాటిని పరిశోధకులు గుర్తించారు.

 The Lake That Has Become An Address To Mysterious Mysteries , Secrets,indian Lak-TeluguStop.com

కానీ, కొన్ని ప్రాంతాల్లో ఉండే సరస్సుల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నా.వారి శ్రమ వృథా అవుతోంది.

భారతదేశంలో కూడా చాలా సరస్సులు ఉన్నాయి.వీటికి పెద్దగా గుర్తింపు కూడా లేదు.

కానీ ఒక్క సరస్సుకు మాత్రం విపరీతమైన క్రేజ్ పెరిగింది.ఈ సరస్సు రహస్యాలను కనుక్కోవడానికి నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

లూనార్ సరస్సు.ప్రస్తుతం చాలా మంది నోట వినిపిస్తున్న పేరు ఇది.వివరాల్లోకి వెళితే.మహారాష్ట్ర లోని బుల్దన జిల్లాలో లూనార్ సరస్సు ఉంది.

అయితే ఈ సరస్సుపై చాలా మందికి అనేక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.ఈ సరస్సు రహస్యాలను తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా అంతు చిక్కడం లేదు.

ఉండుండి ఈ సరస్సు రహస్యం ఓ ఫజిల్‌గా మారుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Telugu Indian Lake, Lonal Lake, Secrets, Latest-Latest News - Telugu

సరస్సులు ఎక్కువ శాతం మానవ నిర్మితాలయితే.లూనార్ సరస్సు మాత్రం ప్రకృతి పరంగా ఏర్పడింది.ఈ మధ్యకాలంలోనే ఈ సరస్సు గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

ఈ సరస్సు గుండ్రంగా ఉండి కొండల మధ్య ఏర్పటడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఉల్కాపాతం భూమిని తాకడం వల్ల ఈ సరస్సు ఏర్పడిందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

లూనార్ సరస్సు భూమి ఉపరితలానికి సరాసరి అర కిలోమీటర్ కంటే ఎక్కువ లోతులో ఏర్పడి ఉంది.ఇదే ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం.70 ఏళ్ల కిందట కొందరు శాస్త్రవేత్తలు ఈ సరస్సు ఎలా ఏర్పడిందనే దానిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.ఒక ఉల్క సెకనుకు 22 కి.మీ.వేగంతో భూమిని ఢీకొట్టిందని, దీని వల్ల ఒక పెద్ద బిలం ఏర్పడి సరస్సులా మారి ఉంటుందని తెలుపుతున్నారు.కానీ దీనికి శాస్త్రీయ పరమైన ఆధారాలు మాత్రం ఇప్పటికీ చూపలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube