టాంపా బే లో జనగణమన ఆలపించిన నాట్స్ బృందం

టాంపా బే : ఆగస్ట్ 17: అజాదీకా అమృతోత్సవాన్ని అటు అమెరికాలో కూడా ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకుంటూ తమ మాతృభూమిపై మమకారాన్ని చాటి చెప్పారు.ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టాంపా బే విభాగం.

 The Knots Team Played To A Crowd In Tampa Bay ,  Tampa Bay, Knots Team, Nats Cha-TeluguStop.com

ఎఫ్‌ఐఏతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంది.ముందుగా భారతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

మన జాతీయ జెండాకు ఆ తర్వాత దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు ఒక్కసారిగా జాతీయగీతం జనగణమన గీతాన్ని ఆలపించారు.దేశ భక్తిని ఉప్పొంగించారు.అలాగే అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు.ఇలా ఇరు దేశాలపై వారికున్న ప్రేమానుబంధాలను చాటారు.

అందరూ మువ్వన్నెల జెండాలు, కార్డులు పట్టుకుని తమ దేశ భక్తిని చాటుకున్నారు.జాతీయ జెండాకు వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో టాంపా బే నాట్స్ విభాగం నాయకులు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల, రాజేశ్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, సురేశ్ బొజ్జ, బిందు సుధ, సుధాకర్ మున్నంగి, సుమంత్ రామినేని, ఎఫ్.ఐ.ఏ ప్రెసిడెంట్ జిగిషా దేశాయ్‌ తో ఆమె కార్యనిర్వాహక బృందం, డాక్టర్ శేఖరం, మాధవి కొత్త పాల్గొన్నారు.ఇతర తెలుగు సంఘాల వాలంటీర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిన నాట్స్ నాయకత్వానికి పేరున పేరున నాట్స్ టాంపా బే బృందం ధన్యవాదాలు తెలిపింది.అందులో ముఖ్యంగా నాట్స్ ఛైర్‌విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య (బాపు) చౌదరి, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ సభ్యులు శేఖరం కొత్త, నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, రాజేశ్ నెట్టెం, భాను ప్రకాశ్ ధూళిపాళ్ల వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్), ప్రొగ్రామ్స్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, టెంపాబే విభాగ సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, జాయింట్ కో ఆర్డినేటర్ సురేశ్ బొజ్జ, సెక్రటరీ రంజిత్ చాగంటి, సోషల్ మీడియా నేషనల్ కో ఆర్డినేటర్ వెంకట్ మంత్రి, మార్కెటింగ్ నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ నిమ్మగడ్డ తదితరులు ఉన్నారు.https://drive.google.com/file/d/142STQl4o6ecJihuDQWR2Q3BiCl9q-OCr/view

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube