కలపలో రారాజు టేకు.. ఎక్కువ కాలం మన్నడానికి కారణమిదే..!

కలప అనేది ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక మెటీరియల్ అని చెప్పవచ్చు.ఫర్నిచర్ కోసం, ఇంటి నిర్మాణాలకు, వంతెనలకు, ఇంకా తదితర వాటి తయారీలలో కలప ఎంతగానో ఉపయోగపడుతుంది.

 The King Of Wood Is Teak Which Is The Reason For Its Longevity , Teku, Kalapa, R-TeluguStop.com

అయితే ఈ కలపలో అన్నిటికంటే దృఢమైన కలపలు కూడా ఉన్నాయి.వాటిలో టేకు కలప అనేది మొదటి స్థానంలో నిలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా టేకు వృక్షాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.ఎందుకంటే ఈ కలప చాలా దృఢంగా ఉంటుంది.

అందుకే కొత్త ఇల్లు కట్టే వారు టేకు వృక్షాల కలపను తప్ప మిగతా కలపను వాడటం చాలా తక్కువ.టేకు కలపకు చెదలు కూడా పట్టదట.ఎందుకలా? దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

టేకు కలపతో తయారుచేసిన వస్తువులకు చెదపురుగులు సోకుతాయని భయపడాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే దానిలో ఉండే సహజ నూనె గుణాలు తెగుళ్లు పట్టకుండా నిరోధించగలవు.టేకులో ఉండే సహజసిద్దమైన నూనె చెదపురుగులు, ఇంకా ఇతర చెక్క కీటకాలను దరి చేరనివ్వకుండా చేయగలవు.

ఆవిధంగా ఇది చెద పురుగుల వల్ల ఎప్పటికీ పాడుకాని అద్భుతమైన కలపగా నిలుస్తోంది.టేకు చెట్ల విషయంలో కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు.

కొందరు సూర్యరశ్మి పడటం వల్ల చెట్లలోని రసాయనాలు ఆవిరైపోయి పురుగులు పడతాయని భయపడుతూ ఉంటారు.కానీ అలా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

చాలా వృక్షాలకు సంబంధించిన కలప ఎండబెడితే అందులోకి పురుగులు పోయి బోలుగా తయారవుతుంది.కానీ టేకు కలప విషయానికొస్తే అలా జరగదు.ఇంకో విశేషం ఏంటంటే, టేకు వాటర్ ప్రూఫ్ గా కూడా పనిచేస్తుంది.నీటిబిందువులు ఈ చెట్టు లోపలికి వెళ్లి ఇంకిపోవు.

అందుకే టేకు వస్తువులను మేనేజ్ చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.మనదేశంలో టేకు వృక్షాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.

ఈ చెట్టు కలప చాలా దృఢంగా ఉండటం చూసి అప్పట్లో బ్రిటీష్ వారు కూడా ఆశ్చర్యపోయారు.తమ ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు ఈ చెట్లతో తయారు చేసిన ఫర్నిచర్ నే వాడేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube