ప్రస్తుత కాలంలో చాలామంది కష్టపడకుండా కోట్లకు కోట్లు సంపాదించి లైఫ్ ఎంజాయ్ చేయాలని అడ్డదారులలో వెళ్లి చివరికి జీవితాన్ని నాశనం చేసుకొని జైలు పాలు అవుతున్నారు.అయితే ఎంత పెద్ద దొంగతనం చేసిన చిన్న తప్పుతో దొరికిపోతారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ఓ యువతి తన భర్తతో కలిసి కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించి విదేశాలకు వెళ్లి విలాసవంతమైన జీవితం గడపాలని ఉంది.అందుకోసం దొంగతనం( theft ) చేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది.ప్లాన్ ప్రకారం ఏకంగా రూ.8.49 కోట్లు కొట్టేసింది.ఇక భర్తతో కలిసి నేపాల్ ( Nepal )వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకుంది.కానీ రూ.10 కూల్ డ్రింక్( Rs.10 cool drink ) కు కక్కుర్తి పడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.అసలు వివరాలు ఏమిటో చూద్దాం.

పంజాబ్ లోని లూథియానాలో జూన్ 10వ తేదీ న్యూ రాజ్ గురు నగర్ లో సీఎంఎస్ సెక్యూరిటీ కి చెందిన క్యాష్ వ్యాన్ దొంగతనం జరిగింది.ఐదుగురు ఉద్యోగులను బంధించి మన్దిప్ కౌర్ అలియాస్ డాకు హసీనా( Hasina ) తన భర్తతో కలిసి రూ.8.49 కోట్లను కాజేసింది.తరువాత భర్తతో కలిసి నేపాల్ పారిపోవాలని అనుకుంది.
పోలీసులు “లెట్స్ క్యాచ్ ది క్వీన్ బి”( Let’s Catch the Queen B ) ఆపరేషన్ నిర్వహించారు.చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విచారించగా ఆ దంపతులు ఇద్దరు నేపాల్ కు వెళ్లే ముందు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్లాన్ చేసుకున్న సమాచారం పోలీసులకు అందింది.

దీంతో పోలీసులు హరిద్వార్, కేదార్నాథ్, హేమకుంట్ సాహిబ్ పుణ్యక్షేత్రాలలో రహస్యంగా పోలీసు బలగాలను దింపారు.పుణ్యక్షేత్రాలలో భక్తుల రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.కాబట్టి పోలీసులు కాస్త తెలివిగా ఆలోచించి అక్కడక్కడ ఉచిత శీతల పానీయం సర్వీస్ నిర్వహించారు.
ఆ దంపతులు తమరిని ఎవరు గుర్తుపట్టరు అని భావించి ఉచితంగా దొరికే కూల్ డ్రింక్ కోసం కక్కుర్తి పడి అక్కడికి వచ్చారు.కూల్ డ్రింక్ తాగాలంటే ముఖానికి ఉన్న ముసుగు తీయాల్సిందే.
డాకు హసీనా ముసుగు తీసి కూల్ డ్రింక్ తాగేలోపే పోలీసులు చుట్టుముట్టి ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా.9 మంది పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యారు.డాకు హసినా కు ధనవంతురాలు కావాలనే ఆశ ఉండడంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.