అమెరికా రాష్ట్రాల కీలక నిర్ణయం...స్వాగతిస్తున్న అమెరికన్స్...కానీ

అగ్ర రాజ్యం అమెరికాని కరోనా మహమ్మారి అల్లాడించింది.ఏ స్థాయిలో అమెరికా కరోనా కారణంగా నష్టపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

 The Key Decision Of The American States  Welcome Americans  But, American , New-TeluguStop.com

కరోన మొదటి వేవ్ సమయంలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ మాస్క్ పెట్టుకోవద్దంటూ వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి కారణంగా ఎంత మంది కరోనాకు బలై పోయారో కూడా తెలిసిందే.ఎక్కడ పడితే అక్కడ శవాలు కుప్పలు తెప్పలుగా రోడ్లపై పడిఉండేవి, మూకుమ్మడిగా కనీసం కుటుంభ సభ్యులు లేకుండా ఖననం జరిగింది.

మాస్క్ ధరించాలని నిపుణులు ఎంతగా సూచించినా ప్రభుత్వ చొరవ లేకపోవడం కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.ఈ క్రమంలోనే.

బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాస్క్ నిభందన కటిన తరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.దాంతో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.

ఒక పక్క వ్యాక్సినేషన్ చేయడంతో కరోనా సోకినా పెద్దగా ప్రభావం చూపించేది కాదు.అయితే మాస్క్ నిభందన మాత్రం కొనసాగుతూనే ఉంది.

ఎందుకంటే గ్యాప్ లేకుండా కరోనా వైరస్ వేరియన్స్ ఒక దాని తరువాత ఒకటి రావడంతో ప్రభుత్వం హెచ్చరికల కారణంగా మాస్క్ నిభందనలు సడలించ లేదు ప్రభుత్వం కాన.

తాజాగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు క్రమ క్రమంగా మాస్క్ నిభందనను తొలగించాలని భావిస్తున్నాయి.ముందు నుంచీ మాస్క్ తప్పనిసరి నిభంధనపై కొందరు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ఇదే సమయంలో కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం తగ్గుతున్న తరుణంలో మాస్క్ నిభంధన నుంచీ వెసులు బాటు ఇవ్వాలని యోచిస్తున్నాయి.ఇందులో భాగంగా న్యూజెర్సీ, డెలావర్, ఒరెగాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్ లో మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ కీలక ఆదేశాలు జారీ చేసాయి.

మొదటి ప్రయత్నంగా పాటశాలల నుంచీ మాస్క్ నిభందన సడలిస్తున్నామని త్వరలో అన్ని ప్రాంతాలలో ఈ సడలింపు అమలవుతుందని సూచన ప్రాయంగా తెలిపాయి.అయితే ఈ నిర్ణయం పై వైద్య నిపుణులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు మంచివి కావని హెచ్చరిస్తున్నారు.

The Key Decision Of The American States Welcome Americans But, American , New Jersey, Delaware, Oregon, Omicron, Corona, Biden - Telugu American, Biden, Corona, Delaware, Jersey, Omicron, Oregon, Keyamerican

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube