ఆ హీరోకు మూతి అలా పగిలింది.. జెర్సీ నటుడు షాహిద్ కపూర్ వీడియో వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ దక్కించుకున్న షాహిద్ కపూర్.

 The Jersey Actor Shahid Kapoor Video Went Viral, Jersey, Shahid Kapoor, Bollywoo-TeluguStop.com

 గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ చిత్రానికి రీమేక్ చిత్రంలో నటించారు.హిందీలో ఈ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోని చిత్రబృందం విడుదల చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సందర్భంగా షాహిద్ కపూర్ ఈ సినిమా షూటింగ్ లో భాగంగా బంతి తన పెదవికి తగలడంతో 25 కుట్లు పడ్డాయని గతంలో వెల్లడించారు.

ఈ మేకింగ్ వీడియోలో కూడా మనం ఈ సన్నివేశాన్ని చూడవచ్చు.ఇలా తన పెదవికి దెబ్బ తగిలి రక్తం కారుతున్న ఆ హీరో ఎంతో కామ్ గా ఉంటూ తన గాయాన్ని క్లీన్ చేసుకుంటున్నాడు.

ఇక ఈ వీడియోకి షాహిద్ కపూర్ స్పందిస్తూ ఈ సినిమాకు నా రక్తాన్ని చిందించాను అంటూ క్యాప్షన్ పెట్టాడు.

Telugu Bollywood, Jersey, Shahid Kapoor, Jerseyshahid-Movie

ఈ వీడియో పై స్పందించిన షాహిద్ కపూర్ భార్య మీరా చోప్రా కూడా తనకు మద్దతుగా నిలబడింది.వీడియో పై షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ స్పందించారు.ఈ సందర్భంగా ఇషాన్ స్పందిస్తూ… నీ కున్న ధైర్యం, ఇష్టానికి ఇది నిదర్శనం.

ఎంతో గర్వంగా ఉంది అన్నా అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube