జనసేన ' లో చిగురిస్తున్న ఆశలు ! కారణం ఎవరంటే ? 

వరుసగా ఎదురవుతున్న ఓటములు పార్టీని ఒక పక్క కుంగదీస్తున్నా, ఎప్పటికైనా అధికారంలోకి వస్తామనే ధీమా మాత్రం జనసేన పార్టీలో కనిపిస్తోంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ గ్లామర్ కూడా ఉండడంతో పాటు, బలమైన కాపు సామాజికవర్గం అండదండలు ఉండడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని , ఎప్పటికైనా ఏపీలో అధికారంలోకి వస్తామనే ధీమా జనసేన పార్టీలో కనిపిస్తోంది .

 The Janasena Party Is Now Hoping To Come To Power Janasena, Tdp, Ap, Bjp, Pavan-TeluguStop.com

ఒక రకంగా చెప్పాలంటే జనసేన లో నాయకుల ప్రభావం కంటే జనసైనికులు ప్రభావం ఎక్కువ.పార్టీ ఆదేశాలు ఉన్న,  లేకపోయినా జనసేన కార్యక్రమాలను చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజలకు దగ్గరయ్యే విధంగా చేయడంలో జనసేన కార్యకర్తల కృషి మాటల్లో చెప్పలేనిది.

2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది.

ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలోనూ ఓటమి పాలయ్యారు.

రానున్న రోజుల్లో జనసేన కనుమరుగైపోతుంది అని, బిజెపి లేక టిడిపిలో విలీనం అవుతుంది అనే ప్రచారం జరిగినా, పార్టీ నుంచి ఎంతోమంది నేతలు బయటకు వెళ్లి పోయినా, ఆ పార్టీని సైనికులు కాపాడుకుంటూ వస్తున్నారు.అయితే 2019 ముందు టిడిపితో పొత్తు, 2019 ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు కలిసివచ్చింది ఏమి లేదు.

ఒక రకంగా చెప్పాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన గ్రాఫ్ క్రమంగా తగ్గిపోయింది అనే చెప్పాలి.ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే జనసేన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. 

Telugu Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan-Telugu Political N

ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ , రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.వైసిపి నేతల్లోనూ టీడీపీ కంటే జనసేన విషయంలోనే ఆందోళన ఉంది.యూత్ ఎక్కువగా జనసేన వైపు ఉండడం, సోషల్ మీడియాలోనూ జనసేన ప్రభుత్వానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వడం వంటివి కాస్త ఆందోళన కలిగిస్తోంది.అయితే ఏపీలో సొంతంగా అధికారంలోకి వచ్చేంత బలం జనసేనకు లేకపోయినా, కార్యకర్తలు మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.

పార్టీపరంగా జనసేనకు అనేక ఇబ్బందులు ఉన్నా, ఎన్నో లోపాలు ఉన్నా, వాటన్నిటినీ అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది.ఒక రకంగా చెప్పాలంటే పవన్ తో పాటు, ఆ పార్టీలో పేరున్న నాయకులు కంటే జనసేన నాయకులే పార్టీ భారాన్ని అంత మోస్తున్నట్లు గా వ్యవహారాలు ఉన్నాయి.

 2024 ఎన్నికల నాటికి జనసేన బలోపేతం అవుతుందని , ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా జనసేన కీలకంగా మారుతుందనే అంచనా అందరిలోనూ కనిపిస్తోంది.దీనంతటికీ కారణం జనసైనికులే అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube