జబర్దస్త్ దెబ్బ.. రోడ్డులపై అడుక్కుంటున్న జబర్దస్త్ వర్ష!

బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయమే.బుల్లితెరలో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Jabardasth Varsha And Emmanuel Begging On The Road , Jabardasth, Varsha, Emmuanu-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తెగ పంచుకుంటుంది.సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

ఇదిలా ఉంటే జబర్దస్త్ వల్ల రోడ్డుపై అడుక్కుంటూ కనిపించింది వర్ష.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో గెస్ట్ గా పాల్గొని ఒక్క స్కిట్ తోనే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దీంతో అక్కడే సెటిలైన వర్ష అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఈ షోలో మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి చేసే రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు.

అతనితో సన్నిహితంగా ఉంటూ హగ్ లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతుంది.గతంలో వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

ఇక జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే మరో ఎంటర్టైన్మెంట్ షోలో కూడా బాగా సందడి చేస్తుంది.

ఇదిలా ఉంటే వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ సందర్భంగా ఈటీవీ లో ఊరిలో వినాయకుడు అనే ప్రోగ్రాంను నిర్వహించనున్నారు.దీంతో తాజాగా ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేశారు.

గెటప్ శీను వినాయకుడి ముందు లడ్డు వేలం పాట వేస్తూ బాగా నవ్వించాడు.ఇక మధ్యలో రోజా, ఇంద్రజ మధ్య మాటలు బాగా ఆకట్టుకున్నాయి.రాంప్రసాద్, హైపర్ ఆది ఓ కాంప్లెక్స్ లో బాగా అల్లరి చేసారు.

ఇక వర్ష స్కిట్ లో భాగంగా సిటీ రోడ్లపై ప్రొపోజ్ చేయాలని కండిషన్ ఇవ్వగా అది కూడా అడుక్కునే గెటప్ లో ప్రపోజ్ చేయాలని ట్విస్ట్ పెట్టడంతో.రోడ్లపై వర్ష పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ అందర్నీ తెగ నవ్వించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube