భారత సంతతి స్త్రీని చంపిన టెర్రరిస్టులకు అదిరిపోయే షాక్ ఇచ్చిన ఇజ్రాయిల్..!!

ఇజ్రాయిల్ కి పాలస్తీనా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులకి  మధ్య గత కొన్ని రోజుల నుండి భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.గాజా ప్రాంతం నుండి ఉగ్రవాదులు వరుసగా పెద్ద యుద్ధ రాకెట్లతో ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లపై దాడులకు పాల్పడుతూ ఉన్నారు.

 The Israel Strong Revenge Who Killed Indian Woman-TeluguStop.com

ఈ క్రమంలో “ఇజ్రాయిల్ ఐరన్ డోమ్” అనేక టెర్రరిస్ట్ రాకెట్లను గాలిలోనే నిర్వీర్యం చేసి .మరికొన్ని వాటిని ఖాళీ ప్రదేశాలలో పడేసింది.దాదాపు 90 శాతం రాకెట్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఐరన్ డోమ్.కొన్ని రాకెట్లను అరికట్టలేక పోయింది.ఈ క్రమంలో హమాస్ ఉగ్రవాదులు వదిలిన రాకెట్లు .ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లపై పడ్డాయి.

ఈ ఘటనతో కొంతమంది ఇజ్రాయిల్ పౌరులు చనిపోగా .ఆదే దాడిలో కేరళ ప్రాంతానికి చెందిన “సౌమ్య సంతోష్” అనే అమ్మాయి కూడా చనిపోయింది.దాడి జరుగుతున్న సమయంలో.భర్తతో ఫోన్ మాట్లాడుతున్న “సౌమ్య సంతోష్” ఉన్న బిల్డింగ్ పై రాకెట్ పడటంతో .వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే ఆమె మరణించడం జరిగింది.ఈ పరిణామంతో ఇజ్రాయిల్ ఊహించని రీతిలో ఉగ్రవాదులకు అదిరిపోయే షాక్ ఇచ్చింది.

 The Israel Strong Revenge Who Killed Indian Woman-భారత సంతతి స్త్రీని చంపిన టెర్రరిస్టుల కు అదిరిపోయే షాక్ ఇచ్చిన ఇజ్రాయిల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 టెర్రరిస్టుల పై ప్రతీకారం తీర్చుకునే రీతిలో ఇజ్రాయిల్ రాకెట్ల పై చనిపోయిన వారి పేర్లు రాసి … ఒక్క తలకు అనేక మూల్యం చెల్లించుకుంటారు అన్న రీతిలో వార్నింగ్ ఇచ్చే విధంగా  హిబ్రూ భాషలో రాసి ఉగ్రవాదులు తలదాచుకున్న భవనాలపై ప్రయోగించింది.ఈ క్రమంలో ఇజ్రాయిల్ ఎయిర్‌ఫోర్స్.

“సౌమ్య సంతోష్” పేరును  పాలస్తీనా మీద ప్రయోగించబోయే ఒక ఫైటర్ జెట్‌కు ఫిక్స్ చేసి  రిలీజ్ చేసి .కీలకమైన టెర్రరిస్టులను హతమార్చడం జరిగిందట.ఈ వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.

ఇదే క్రమంలో “సౌమ్య సంతోష్” కుటుంబం యొక్క బాధ్యతలను ఇజ్రాయిల్ ప్రభుత్వం చూసుకుంటుందని, అదేవిధంగా “సౌమ్య సంతోష్” కొడుకు భవిష్యత్తు కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది అని ఇజ్రాయిల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది.

భారత స్త్రీ ని చంపిన ఉగ్రవాదుల పట్ల ఇజ్రాయిల్. ఈ రీతిలో ఊహించని విధంగా రిప్లై ఇవ్వటం తో ఈ వార్త విని చాలా మంది భారతీయులు.

రణ నీతి, యుద్ద రీతి ఇప్పుడు ఇజ్రాయిల్ అనుసరిస్తున్నది అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  

.

#Soumya Santosh #IsraelAnd #Palastina #IsraelIron #Israel

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు