అవునుని మక్కీకి మక్కీ దించేసిన హాలీవుడ్ సినిమా  

The Invisible Man Story Look Like Avunu Movie - Telugu Avunu Movie, Director Ravibabu, Hollywood, The Invisible Man Story, Tollywood

హాలీవుడ్ సినిమాలని కాపీ లేదంటే అందులో ఉన్న ఎలిమెంట్ ఇన్స్పైర్ అయ్యి మన ఇండియాలు సినిమాలు చేస్తూ ఉంటారు.తెలుగులో చాలా సినిమాలు హాలీవుడ్ లో స్ఫూర్తితో తీసినవి ఉన్నాయి.

The Invisible Man Story Look Like Avunu Movie - Telugu Director Ravibabu Hollywood Tollywood

గతంలో ఎన్టీఆర్ నుంచి ఇలాంటి హాలీవుడ్ కంటెంట్ లని ఇండియా సినిమాలలో చూస్తున్నాం.ఈ జెనరేషన్ లో రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులు హాలీవుడ్ సినిమాలని స్ఫూర్తిగా తీసుకొని కథలు సిద్ధం చేసుకుంటారు.

వారి మీద ఈ విషయంలో కొంత నెగిటివ్ ప్రచారం కూడా ఉంది.అయితే అప్పుడప్పుడు హాలీవుడ్ దర్శకులు కూడా మన ఇండియన్ సినిమాలని కాపీ చేయడం లేదంటే స్ఫూర్తితో తీసుకొని కథలు రెడీ చేయడం చేస్తూ ఉంటారు.

అలా వచ్చినవి వాటిలో ఇండియాన జోన్స్ సిరీస్ లో ఒక సినిమా కూడా ఉంది.ఇక ప్రపంచం అంతా సినిమా మార్కెట్ విస్తరించడంతో మంచి కథలు ఎక్కడ దొరికిన తీసుకోవడానికి హాలీవుడ్ దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నారు.

ఈ నేపధ్యంలో తాజాగా హాలీవుడ్ లో బడా నిర్మాత సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ది ఇన్విజిబుల్ మెన్ సినిమా ఒక తెలుగు సినిమాని పోలి ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.రవిబాబు దర్శకత్వంలో గతంలో వచ్చిన అవును సినిమా తరహాలో ఇది ఉంది.

ఆ సినిమాలో చనిపోయిన సైకో విలన్ కనిపించకుండా హీరోయిన్ ని బెదిరిస్తూ ఆమె మీద కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు.ఇందులో కూడా కనిపించకుండా ఉన్న వ్యక్తి కూడా హీరోయిన్ ని భయపెడుతూ ఉంటాడు.

తాజాగా రిలీజ్ అయిన ఈ ఇన్విజిబుల్ ట్రైలర్ చూస్తూ ఉంటే నేరేషన్ మొత్తం అవును సినిమాని ఫాలో అయినట్లు కనిపిస్తుంది.అయితే హర్రర్ జోనర్ లో వచ్చిన కథలు అన్ని ఒకేలా ఉంటాయి కాబట్టి ఒకదానితో ఒకటి పోల్చలేం అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు