తిరుపతి జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సజీవ దహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది.
చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో కారులో సాఫ్ట్వేర్ నాగరాజును బంధించిన దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు తెలుస్తోంది.తిరుపతి నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా ఘటన జరిగింది.
కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు మృతుడిని గుర్తించారు.ఘటనా స్థలంలో గోల్డ్ చైన్, చెప్పులు లభ్యం అయ్యాయి.
అయితే సజీవ దహనం చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.అదేవిధంగా నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.