ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆగిపోనుంది ... కానీ ...?  

The Internet Will Stop-

ఇప్పుడు నడిచేది అంతా ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్ లేకపోతే సకల సదుపాయాలు ఆగిపోవడమే కాదు ప్రపంచ వ్యవస్థనంతా ఎక్కడికక్కడే ఆగిపోతుంది. ఇప్పడు ప్రతిదీ ఇంటర్నెట్ తో ముడిపడే ఉంది. అలాంటి ఇంటర్ నెట్ ఒక వేళ నిజంగా ఆగిపోతే ఊహించడానికే భయమేస్తుంది కదా. ఇది కనుక ఆగిపోతే… ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు వెబ్‌సైట్లు మనం ఉపయోగించే స్మార్ట్‌ ఫోన్లూ ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. రానున్న 48 గంటల్లో ఇదే జరగబోతోందని నిన్నటి నుంచి లెక్కలేనన్ని వార్తలొస్తున్నాయి. డీఎన్‌ఎస్‌ఎస్‌ఈసీ (డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ సెక్యూరిటీ ఎక్స్‌టెన్షన్స్‌) అప్డేషన్‌ కారణంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతాయంటూ కథనాలు వెలువడ్డాయి. మరి ఇందులో నిజమెంత ఉందొ చూద్దాం !

The Internet Will Stop-

The Internet Will Stop

అప్డేషన్‌ను చేపట్టే ఐసీఏఎన్‌ఎన్‌ (ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌) ఈ వార్తలను ఖండించింది. అప్డేషన్‌ వార్త నిజమేనని ఐతే ఇది సాధారణంగా జరుగుతున్న నిర్వహణ పనేనని ఐసీఏఎన్‌ఎన్‌ వెల్లడించింది. అప్‌డేట్‌ చేయడం ప్రారంభించి ఓ రోజు గడచిందని అక్కడక్కడా చిన్న చిన్న అంతరాయాలు తప్పించి ఇంటర్నెట్‌ వినియోగదారులకెవ్వరికీ ఇబ్బంది కలగలేదని ఐసీఏఎన్‌ఎన్‌ చెప్పింది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 99 శాతం మందికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని స్పష్టం చేసింది. వెబ్‌ పేజీలు నెమ్మదిగా తెరుచుకోవడం, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదని చూపించడం వంటి చిన్నచిన్న సమస్యలు తప్పితే మరెలాంటి ఇబ్బందులూ ఉండవని తేల్చింది.