ఇలాంటి సిత్రాలు మునుపెన్నడూ చూసి ఉండరుగా..?!

చాలా మందికి పెయింటింగ్ వేయడం అన్నా, బొమ్మలు గియడం అన్నగాని చాలా ఆసక్తి.అయితే అలా చేతిలో కుంచె పట్టుకుని బొమ్మలు వేయడం అనేది అందరి వల్ల కాదు.

 The International 3d Paint Artist Shika Sharmas Tripping Arts Going Viral On Social Media-TeluguStop.com

అది ఒక ఆర్ట్ అనే చెప్పాలి.కొంతమంది కుంచెతో పెంయింటింగ్ వేస్తారు.

మరికొందరు ఇసుకతో, సుద్దతో గీస్తారు.కానీ ఈ మహిళ వేసే చిత్రాలు మాత్రం బహుశా మీరు ఎక్కడా చూసి ఉండరు.

 The International 3d Paint Artist Shika Sharmas Tripping Arts Going Viral On Social Media-ఇలాంటి సిత్రాలు మునుపెన్నడూ చూసి ఉండరుగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానంతట అదే క్షణంలో మారిపోతుంది.ఏంటి ఇది కలా లేక నిజమా.? అని అనుకునే లోపే మరో చిత్రంగా మారిపోతుంది.దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ.అసలు అలా ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతారు.

ఈ చిత్రంలో మొదట మనకి ఒక అందమైన అమ్మాయి నేలపై అలా కూర్చొని ఏదో న్యూస్‌ పేపర్‌ చదువుతున్నట్లు మనకి కనిపిస్తుంది.అది నిజం అని నమ్మేలోపే ఆ అమ్మాయి మీద వేరే అమ్మాయి వచ్చి ఒక కర్చీఫ్‌ వేస్తుంది.

ఇంతలో కూర్చొని పేపర్ చదువుతున్న ఆ అమ్మాయి కాస్త చిత్రంగా మారిపోతుంది.మళ్ళీ ఈ అ‍మ్మాయి ఆ చిత్రాన్ని చెరిపివేసి నవ్వుతూ కూర్చుంటుంది.

ఆ అమ్మయి నవ్వు చూసేటప్పటికీ మళ్లీ అదంతా చిత్రంగా మారిపోయి దాన్ని చిత్రిస్తున్న అ‍మ్మాయి ఆర్టిస్టుగా కనిపిస్తుంది.

Telugu Artist Shikha Sharma, Aspiring Painting, International 3d Paint Artist Shika Sharma, Latest News, News Viral, Social Media, Tripping Arts, Viral Latest, Viral On Social Media, World Record-Latest News - Telugu

అసలు ఈ చిత్రాలు అలా ఎలా మారుతున్నాయో అర్ధం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.ఇంకొక విషయం ఏంటటే.ఈ ఆర్టిస్ట్ నే తనను తానే అన్నిరకాలుగా చిత్రికరించి అద్భుతంగా రూపొందించింది.

అసలు ఇలాంటి విచిత్రమైన చిత్రాలు గీసిన ఆ మహిళ ఆర్టిస్ట్ మరెవరో కాదు అంతర్జాతీయ త్రీడీ పెయింటింగ్‌ కళాకారిణీ, వరల్డ్‌ రికార్డు గ్రహీత అయిన శిఖా శర్మ.తన ‘ట్రిప్పింగ్’ ఆర్ట్ తో ఇలా అద్భుతమైన చిత్రాలు గీసి అందరి మనసులను దోచుకుంటుంది.

మీరు ఈ చిత్రాల ప్రత్యేకత గురించి చదవడం కన్నా చూస్తేనే ఆ గొప్పదనం ఏంటో అర్ధం అవుతుంది.ప్రస్తుతం ఈ చిత్రాలు నెటిజన్ల మనసును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

#ArtistShikha #World

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube