ఆ కొత్త వారు శ్రీనువైట్లకు జీవం పోస్తారా?     2018-11-14   10:23:46  IST  Ramesh P

‘దూకుడు’ చిత్రం తర్వాత శ్రీనువైట్ల స్థాయి అమాంతం పెరిగి పోయింది. అయితే ఆ తర్వాత సినిమా నుండి శ్రీనువైట్ల డౌన్‌ ఫాల్‌ ప్రారంభం అయ్యింది. బాద్‌ షా, ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్‌ ఇలా నాలుగు సినిమాలు కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో శ్రీనువైట్ల కళ్లు బైర్లు కమ్మేశాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రవితేజ ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. యువ హీరోలు కూడా నో చెప్పిన సమయంలో రవితేజ ఛాన్స్‌ ఇవ్వడంతో వైట్ల ఆ ఛాన్స్‌ను పూర్తిగా వాడేసుకోవాలని ఫిక్స్‌ అయ్యాడు. అందుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంను తెరకెక్కించి ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

The Interesting Facts About Director Amar Akbar Anthony Movie-New Writer In Movie Ravi Teja Revie Of Srinuvitla

శ్రీనువైట్ల దూకుడు సినిమా సమయంలో రచయితలు గోపీ మోహన్‌, కోన వెంకట్‌ లతో కలిసి సినిమా చేశాడు. ఆ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వడంతో ఆ తర్వాత కూడా వారితో కలిసి చేశాడు. బాద్‌ షా సమయంలో వారితో గొడవలు అవ్వడం, ఆగడు చిత్రంకు సొంతంగా స్క్రిప్ట్‌ను సిద్దం చేసుకోవడం చేశాడు. రచయితలతో కలిసి చేస్తేనే తనకు సక్సెస్‌ వస్తుందని భావించిన వైట్ల మళ్లీ విభేదాలను పక్కన పెట్టి కోన మరియు గోపీ మోహన్‌లతో సినిమా చేశాడు. అదే బ్రూస్‌లీ. అది కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లాపడినది.

The Interesting Facts About Director Amar Akbar Anthony Movie-New Writer In Movie Ravi Teja Revie Of Srinuvitla

తాజాగా వైట్ల తెరకెక్కించిన అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రం కోసం కొత్త రైట్లతో వైట్ల వర్క్‌ చేశాడు. తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో ఆ కొత్త రైటర్లను కూడా పరిచయం చేశాడు. గతంలో వీరు పెద్దగా సినిమాలు చేసిన అనుభవం లేదు. అయినా కూడా వీరితో పెద్ద ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాడు. కొత్త వారు అని తేలికగా తీసేయవద్దు. మంచి ప్రతిభ ఉన్న వారు ఎవరైనా స్టార్స్‌కు మంచి కథలు ఇవ్వగలరు. అందుకే ఈ చిత్రంకు రచయితలు కొత్త వారే అయినా కూడా వైట్లకు మరియు రవితేజకు సక్సెస్‌ను తెచ్చి పెడతారేమో చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.