దుబాయ్ లో మిలియన్ డాలర్స్ ని గెలుచుకున్న భారతీయుడు.. ఎలాగంటే..?!

కరోనా కాలంలో ఎంతో మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు.వివాహితులు నిరుద్యోగులు అయ్యి తమ కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు.

 The Indian Who Won Millions Of Dollars In Dubai How, The Indian,  Won , Millions-TeluguStop.com

విదేశాల్లో నివసించే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.చెప్పాపెట్టకుండా విదేశీ కంపెనీలు ఉద్యోగస్తులను తీసేశారు.

అయితే కేరళకు చెందిన 30 ఏళ్ల నవనీత్ సజీవన్ అబుదాబి ఆధారిత కంపెనీ లో పని చేస్తుండగా అతని ఉద్యోగం కరోనా సమయంలో ఊడిపోయింది.ఆర్థిక సంక్షోభం కారణంగా తమ ఉద్యోగస్తులను తీసివేస్తున్నామని ప్రకటించడంతో నవనీత్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.

తన భార్యను పిల్లలను ఎలా పోషించాలో తెలియక మళ్లీ తన కంపెనీకి వెళ్లి ఉద్యోగ అవకాశం కల్పించాలని అడిగాడు.అయితే ఆయన విజ్ఞప్తి ని కన్సిడర్ చేసిన కంపెనీ డిసెంబర్ 28వ తేదీ వరకు ఉపాధి కల్పిస్తామని చెప్పింది.

ఆ తర్వాత తన కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక జాబ్ సంపాదించాలని నవనీత్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే నవంబర్ 22 వ తేదీన నవనీత్ ఆన్ లైన్ లో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.

అదృష్టవశాత్తు ఆ లాటరీ లో నవనీత్ గెలుపొందాడు.దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా ప్రతి ఏడాది 1 మిలియన్ డాలర్స్ ని లాటరీ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేసుకున్నవారిలో అదృష్టవంతులు అయిన వారికి ఇచ్చేస్తుంది.

ఈసారి ఆ మొత్తం గెలుచుకునే అదృష్టం నవనీత్ కి దక్కింది.ఉపాధి కోల్పోయి తన భార్య పిల్లలకు అవసరాలు తీర్చలేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుమారు రూ.8 కోట్ల లాటరీ గెలుచుకోవడం తో నవనీత్ బాగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.అయితే ఒక మిలియన్ డాలర్లతో ఏం చేయాలో పాలుపోవడం లేదని.

కొంత డబ్బును స్నేహితులకు, కొంత డబ్బులు బాకీ తీర్చడానికి ఉపయోగిస్తాం అని మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు నవనీత్.మిగిలిన డబ్బును తమ భార్య పిల్లల కోసం ఉపయోగిస్తానని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube