15 ఫోర్లు, 7 సిక్స్‌లతో బౌలర్లను ఉతికారేసిన ఇండియన్ ప్లేయర్.. మ్యాచ్ వివరాలు ఇవే!

చాలా ప్రముఖ దేశాల్లో క్రికెట్ ఆట పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది కానీ అమెరికా వంటి కొన్ని దేశాల్లో ఇప్పటికీ క్రికెట్ ఓ కొత్త ఆట గానే ఉండిపోయింది.ఇటీవల కాలంలో అమెరికాలో సైతం క్రికెట్ ఆటను ఎంజాయ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

 The Indian Player Who Bowled 15 Fours And 7 Sixes .. Here Are The Match Details!-TeluguStop.com

ఇప్పటికే టీ20 మ్యాచ్లను వీక్షిస్తూ అమితమైన వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.వారిని ఎంటర్టైన్ చేయడానికి క్రికెటర్లు సైతం అమెరికా కి తరలి వెళ్తున్నారు.

ముఖ్యంగా తమ దేశ జట్టులో టీ20 మ్యాచులలో ఆడే అవకాశం దక్కించుకోలేని వారు అమెరికాకి వెళ్తున్నారు.అక్కడ తమ ప్రతిభతో క్రికెట్ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నారు.

ఇలాంటి ఆటగాళ్లలో ఉన్మక్త్ చంద్ అనే ఓ ఇండియన్ ప్లేయర్‌ కూడా ఉన్నాడు.

ప్రస్తుతం అమెరికాలో మైనర్ క్రికెట్ లీగ్‌ జరుగుతోంది.

ఈ లీగ్‌లో ఉన్మక్త్ తన బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్నాడు.బౌలర్ల వేసే బంతులను నేరుగా బౌండరీలకే చేరుస్తున్నాడు.

అతడు 20 ఓవర్ల మ్యాచ్ లో 22 బంతుల్లోనే 102 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.ఈ మైనర్ లీగ్ క్రికెట్‌లో తాజాగా ఆస్టిన్ అథ్లెటిక్స్, సిల్కెన్ వ్యాలీ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఉన్మక్త్ చంద్ సిల్కెన్ వ్యాలీ స్ట్రైకర్స్‌ జట్టు తరఫున ఆడాడు.తొలత బ్యాటింగ్ చేసిన ఆస్టిన్ అథ్లెటిక్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 184 స్కోర్ చేసింది.

సిల్కెన్ వ్యాలీ స్ట్రైకర్స్ టీం 3 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కష్టానికి 185 పరుగుల చేసి విజయం సాధించింది./br>

Telugu Sixes, Indian, Latest-Latest News - Telugu

ఈ మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ బౌలర్లను ఉతికారేస్తూ… 69 బంతుల్లో 132 పరుగులు చేసి జట్టుని గెలిపించాడు.ఉన్మక్త్ చంద్ మొత్తం 15 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టి రికార్డులను తిరగరాశాడు.ఈ మైనర్ లీగ్ మ్యాచుల్లో మొత్తం 434 బంతులను ఎదుర్కొన్న ఉన్ముక్త్ 534 పరుగులు చేశాడు.53.20 సగటుతో 122.58 స్ట్రైక్ రేట్‌తో అందరికంటే అతడే గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.14 మ్యాచ్‌లలో 18 సిక్సర్లు, 52 ఫోర్లు కొట్టి ఎవరూ అందుకోలేని రికార్డు నెలకొల్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube