కోట్లాది మంది అమెరికన్స్ ను కదిలించిన...“భారత రైతు ఉద్యమం”

భారత్ లో సుదీర్ఘంగా జరుగుతున్న రైతు ఉద్యమం ఎంతో మందిని కదిలిస్తోంది.నిన్న మొన్నటి వరకూ భారత్ కు మాత్రమే పరిమితం అయిన ఈ ఉద్యమం నేడు అంతర్జాతీయ స్థాయిలో పీక్ స్టేజ్ కి చేరుకుంది.

 The indian Peasant Movement That Moved Millions Of Americans, India, Bollywood,-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం వరకూ ఈ ఉద్యమానికి బాలివుడ్, హాలీవుడ్ నటీ నటులు మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ ఉద్యమం పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమానికి మద్దతు దొరుకుతూ వచ్చింది.

అమెరికాలో ఉండే భారతీయ ఎన్నారై సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి, స్థానికంగా ర్యాలీలు కూడా చేపట్టాయి.

అయితే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ బహిరంగంగా ప్రకటించడంతో భారత ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది.

ఇది మా అంతర్గత వ్యవహారమని ఇందులో ఏ దేశం కూడా జోక్యం చేసుకోవడానికి వీలులేదని తేల్చి చెప్పేసింది.కానీ ఇది భారత్ యొక్క వ్యక్తిగత వ్యవహారం కాదని భావిస్తున్న పలు దేశాలు రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తూనే ఉన్నాయి.

తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా లో అతిపెద్ద ఫుడ్ బాల్ సూపర్ బాల్ -2021 కార్యక్రమం నిర్వహించారు.ఈ ఈవెంట్ ను దాదాపు 10 కోట్ల మంది చూస్తారట.ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో కోట్లాది మంది చూస్తుండగానే భారత్ లోని రైతుల ఉద్యమానికి సంభందించిన.

30 సెకన్ల నిడివిగల ఓ వీడియో ప్రసారం అయ్యింది.అందరిని కదిలించేలా సాగిన ఈ వీడియో లో రైతులకు మనం మద్దతు తెలుపుదాం అని ఉంది.సరైన తిండి లేకపోయినా, భవిష్యత్తు అంధకారంలో ఉన్నా ఆ రైతులు చేస్తున్న పోరాటానికి మనవంతు మద్దతు ఇవ్వకపోతే ఎలా అంటూ ఈ వీడియో సాగింది.

ఎంత మంది ఈ ఉద్యమంలో చనిపోయారు, రైతులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనే పుటేజ్ లో ప్రదర్శిస్తూ అందరిని కట్టిపడేశారు.ఇదిలాఉంటే ఇంత పెద్ద ఈవెంట్ లో ఈ వీడియో ప్రదర్సన చేయాలంటే ఎంత హీనంగా చూసుకున్నా రూ.40 కోట్లు పైనే ఖర్చు అవుతుందట, మరో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరు ఖర్చు పెట్టారు అంటే వాల్ సీక్ అనే కమ్యూనిటీ నిధులను ఈ యాడ్ కోసం వెచ్చించారని తెలుస్తోంది.మరి సదరు వీడియోపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

https://twitter.com/simran/status/1358563007018766337?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1358563007018766337%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Ffarmers-protest-advertisement-super-bowl-event-1342858

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube