అమెరికా సెనేటర్ గా భారత సంతతి మహిళ..     2019-01-22   13:53:23  IST  Surya Krishna

అమెరికాలో ప్రవాస భారతీయుల హవా ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుంది. కీలక మైన పదవుల్లో అమెరికాలో కొనసాగుతున్న ప్రవాసులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం భారతీయులని చెప్పడంలో ఆలోచించే అవసరం లేదు. దీనికి ఎన్నో సంఘటనలు రుజువులుగా ఉన్నాయి. అయితే తాజాగా మరొక భారత సంతతి మహిళ అమెరికాలో సెనేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

The Indian NRI Women As American Senator-Mona Dass Nri Telugu Nri News Updates

The Indian NRI Women As American Senator

అయితే ఆమె తన ప్రమాణ స్వీకారంలో హిందువుల పవిత్ర గ్రంధం అయిన భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేయడం అందరిని ఆశ్చర్య పరించింది. డెమోక్రాటిక్ పార్టీ తరుపున మోనా దాస్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసి భాధ్యతలు చేపట్టారు. మోనా ఎనిమిదేళ్ళ వయస్సులో ఉన్నప్పుడే ఆమె తల్లి తండ్రులు బీహార్ నుంచీ వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు.

The Indian NRI Women As American Senator-Mona Dass Nri Telugu Nri News Updates

మోనా సిన్సినాటీ యూనివర్సిటీ నుంచి సైకాలజీ డిగ్రీ పట్టా పొందటమే కాకుండా చదువుల్లో ఎంతో నైపుణ్యం ప్రదర్శించేవారు. భారతీయ సంస్కృతీ పట్ల అపారమైన గౌరవం చూపించే మోనా మహిళలు సైతం పురుషులతో సమానంగా రాణించాలని అంటారు. ఇక ప్రమాణ స్వీకారం తరువాత ఆమె జై హింద్‌, భారత్ మాతాకి జై అంటూ ట్వీట్ చేశారు.