Ruthuraj Gaikwad : అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది.. ఒకే ఓవర్లో 7 సిక్సులు బాదేశాడు!

భారత జట్టు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ఆల్ టైమ్‌ రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.కాగా తాజాగా ఆ రికార్డును ఒక యువ క్రికెటర్ బద్దలు కొట్టాడు.

 The Impossible Became Possible He Hit 7 Sixes In A Single Over , Cricket, Sixers-TeluguStop.com

టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ తాజాగా ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్స్‌లు బాదాడు.దాంతో అతడి పేరు మీద వరల్డ్ రికార్డు నమోదయింది.

నిజానికి ఇప్పటి వరకు ఏ ఫార్మాట్ క్రికెట్‌లో ఏ బ్యాటర్‌ కూడా సింగిల్ ఓవర్‌లో వరుసగా 7 సిక్సులు కొట్టలేదు.అయితే ఆ అసాధ్యాన్ని మన రుతురాజ్ విజయ్ హజారే ట్రోఫీలో సుసాధ్యం చేశాడు.

ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్స్‌లు ఎలా కొట్టాడంటే.ఒక బాల్ నోబాల్‌తో అయింది.

దాంతో ఫ్రీ హిట్ వచ్చింది.ఆ ఫ్రీ హిట్‌ను కూడా సిక్స్ బాదాడు.

ఈ ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర తరపున ఆడుతున్నాడు.కాగా అహ్మదాబాద్‌లో ఉత్తర్ ప్రదేశ్‌ వేదికగా జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో రుతురాజ్ సింగిల్ ఓవర్‌లో 7 సిక్సులు కొట్టాడు.

ఉత్తరప్రదేశ్ బౌలర్ శివా సింగ్ వేసిన 49వ ఓవర్‌లో ఈ ఘనతను రుతురాజ్ సాధించాడు.అతడు ఈ ఓవర్‌లో మొదటి నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు కొట్టాడు.5వ బంతి నోబాల్‌ అయింది.కాగా దానిని కూడా సిక్స్ కొట్టాడు.

ఆపై మరో రెండు బాల్స్ కూడా రుతురాజ్ సిక్సులు బాదాడు.అలా ఈ ఓవర్‌లో ఏకంగా 43 పరుగులు వచ్చాయి.

ఈ బౌండరీలతో సింగిల్ ఓవర్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రుతురాజ్ చరిత్ర సృష్టించాడు.ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లు సాయంతో 220 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఈ స్కోరుతో మహారాష్ట్ర టీమ్ 50 ఓవర్లలో 330 రన్స్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube