అందరి జీవితాల్లో వెలుగులు నింపే ఐదు రోజుల పండుగ దీపావళి ప్రాముఖ్యత!

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఎన్నో పండుగలలో దీపావళి పండుగ ఒకటి.ఈ దీపావళి పండుగను ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

 The Importance Of Diwali A Five Day Festivaliw Diwali, Estiva, 5 Days Festival,-TeluguStop.com

దీపావళి పండుగ రోజు లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.అయితే కొన్ని చోట్ల దీపావళి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగా దీపావళిని జరుపుకుంటారు.

ఈ దీపావళి పండుగను జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే పురాణాల ప్రకారం లక్ష్మీదేవి నరకాసురుడిని వధించడంతో ఆ రాక్షసుడు పీడ విరగడయిందని భక్తులు పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ ఈ పండుగను జరుపుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

అదేవిధంగా శ్రీరాముడు అరణ్యవాసం ముగించుకుని సీతాసమేతంగా అయోధ్య తిరిగి చేరుతున్న సమయంలో అయోధ్య ప్రజలందరూ సంతోషంలో వీరిని అయోధ్యకు ఆహ్వానించినట్లు చెబుతారు.

Telugu Days Festival, Ayodhya, Diwali, Estiva, Hindu Beliefs, Lakshmi Devia, Sri

ఈ క్రమంలోనే దీపావళి పండుగలో భాగంగా ధన త్రయోదశి రోజు తమ వారసులను అనుగ్రహించడం కోసం పితృ దేవతలు భువి పైకి వస్తారని, వారికి దారి చూపడం కోసమే ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని పండితులు చెబుతుంటారు.ఇలా పెట్టే దీపాన్ని యమదీపం అని ఇలా యమ దీపం పెట్టడం వల్ల అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు.ఇలా ఐదు రోజుల పాటు ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటూ లక్ష్మీదేవికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా వివిధ రకాల మిఠాయిలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఈ పండుగను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube