పెళ్ళైన వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?  

The Importance Of Arundhati Nakshatram In Marriage-

పెళ్ళైన వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించే ఆచారం చాలా ప్రాచీన కాలం నుండి సంప్రదాయంగా వస్తుంది.వివాహ సమయం పగలు అయిన రాత్రి అయినా ఏ సమయంలో అయినా సరే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు.

The Importance Of Arundhati Nakshatram In Marriage---

వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి.ఆమె మహా ప్రతివ్రత.వారి దాంపత్యం ఆదర్శవంతమైన … అన్యోన్యమైనది.ఆమె తన పాతివ్రత్య మహిమచే కాలగమనాన్ని సైతం ఆదేశించగల శక్తిమంతురాలు.అందువలన కొత్తగా పెళ్లైన జంటలు ఆ దంపతులను ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో పెళ్లైన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు.ఈ విధంగా చేయటం వలన వారి దాంపత్యం సుఖమయం అవుతుందని పెద్దల నమ్మకం.

ఇక రాత్రి వేళల్లో … తెల్లవారు జామున కనిపించే అరుంధతి నక్షత్రం కోసం ఆకాశం వంక చూస్తారు కాబట్టి, ఆ నక్షత్రాల కాంతి కారణంగా దృష్టికి సంబంధించిన దోషాలు తొలగి కంటిచూపు బలపడుతుందని పెద్దలు చెబుతుంటారు.