అలా చేస్తే వారు నిజ‌మైన భార‌తీయులే కాదంటున్న గంభీర్‌..

క్రికెట్ అంటే ఎప్పుడూ మ‌న దేశంలో ఓ పెద్ద చ‌ర్చ‌.దాన్ని ఆట‌గా చూసేకన్నా అంత‌కు మించి అన్న‌ట్టు ప‌బ్లిక్ చూస్తుంటారు.

 If So They Are Not Real Indians Said By Gambhir Details, Gautam Gambhir, Cricket-TeluguStop.com

దాంతోనే లేనిపోని చ‌ర్చ‌లు తెర‌మీద‌కు వ‌స్తుంటాయి.ఇక దాయాది పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే దేశం మొత్తం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇండియా గెల‌వాలని పూజ‌లు చేస్తుంటారు చాలామంది.అందుకే టీమ్ ఇండియా ఏ దేశంతో ఆడినా రాని క్రేజ్ మొత్తం కేవ‌లం పాకిస్థాన్‌తో ఆడితేనే వ‌చ్చేస్తుంది.

ఇక‌మ మొన్న టీ20 వరల్డ్ క‌ప్ 2021 టోర్నీలో భాగంగా టీమిండియా అలాగే పాకిస్తాన్ మ‌రోసారి త‌ల‌ప‌డ్డాయి.

అయితే ఇందులో ఎవ‌రూ ఊహించని షాక్ ఇస్తూ పాకిస్తాన్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

గ‌త 12 వరుస ఓటముల త‌ర్వాత పాకిస్తాన్ గెల‌వ‌డంతో ఆ దేశంలో సంబురాలు మిన్నంటాయి.కాగా ఈ ఓట‌మిపై ఇండియాలో మాత్రం పెద్ద ఎత్తున ట్రోలింగ్ న‌డిచింది.

తీవ్ర నిరాశ‌లో ఇండియా టీమ్ ఫ్యాన్స్ ఉన్నారు.ఇక్క‌డే కొన్ని ఘ‌ట‌న‌లు ప్ర‌తి ఒక్క‌రినీ షాక్‌కు గురి చేశాయి.

అదేంటంటే పాకిస్తాన్ గెల‌పును సెలబ్రేట్ చేసుకుంటూ ఇండియాలో కొంద‌రు ముస్లిమ్‌లు టపాసులు పేల్చారు.ఏకంగా ఇండియాలోనే పాక్ జెండాలతో సంబురాలు చేసుకోవ‌డంపై గంభీర్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

Telugu Cricket, Gautam Gambhir, Icc Cup, India Pakistan, Pak India, Verendra Seh

మాజీ స్టార్ క్రికెట‌ర్ అయిన‌టువంటి గంభీర్ స్పందిస్తూ ఇలా ఇండియా ఓట‌మిని ప‌క్క‌న పెట్టి పాకిస్తాన్ గెల‌పును సెల్ర‌బేట్ చేసుకోవ‌డం త‌న‌ను షాక్ గురి చేసింద‌ని ఆయ‌న ట్వీట్ చేశాడు.అంతే కాదు పాకిస్థాన్ గెలుపును ప‌టాసుల రూపంలో సెల‌బ్రేట్ చేసుకున్న వారు అస‌లు భారతీయులే కాదంటూ సంచ‌ల‌న ట్వీట్ చేశాడు.తామెప్పుడూ టీం ఇండియాకు స‌పోర్టుగా ఉంటామ‌ని అంతే గానీ ఇలా పాకిస్తాన్ కు స‌పోర్టు చేయ‌డ‌మేంటని మండిప‌డ్డారు.ఇక మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

ఇలాంటి వాతావ‌ర‌ణం మంచిది కాదంటూ హెచ్చ‌రించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube