ఇకపై అలా బౌలింగ్ చేస్తే షాకే.. విస్తుగొల్పుతున్న ఐసీసీ లేటెస్ట్ రూల్స్..

పాతకాలం నాటి రూల్స్ మార్చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చూపడంలో క్రికెట్ నిర్వాహకులు ముందుంటున్నారు.తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కమిటీ మరోసారి సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది.

 The Icc Latest Rules That Shake Is Disheartening If He Bowls Like That Anymore-TeluguStop.com

ఈసారి టీ 20 ఫార్మాట్ కోసం సంచలనాత్మక నియమ నిబంధనలను పరిచయం చేసింది.ఈ రూల్స్ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.

వెస్టిండీస్, ఐర్లాండ్‌ల మధ్య జనవరి 16న ఒక మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ నుంచే కొత్త రూల్స్ అమలవుతాయి.

అయితే ఈ కొత్త రూల్స్‌లో ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్, స్లో ఓవర్ రేట్‌కు ఇన్-మ్యాచ్ పెనాల్టీ వంటివి ఉన్నాయి.అయితే వీటన్నింటిలో స్లో ఓవర్ రేట్‌కు ఇన్-మ్యాచ్ పెనాల్టీ అద్భుతంగా ఉందని దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా టీ20 మ్యాచ్ లో బ్యాటర్లకు విసుగు తెప్పించడానికి కొన్ని ఓవర్లను చాలా స్లోగా వేస్తుంటారు.దీని వల్ల ఆలస్యంతో పాటు బ్యాటింగ్ జట్టులో అసహనం పెరుగుతుంది.

కొందరు బౌలర్లు చాలా బద్దకంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ ను సాగదీస్తుంటారు.ఫాస్ట్ గా ఫీల్డింగ్ చేయకుండా క్రికెటర్లు కూడా స్లోగా ఆడుతుంటారు.

దీనివల్ల టీ20 మ్యాచులు అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యంగా పూర్తవుతాయి.అందుకే ప్రతి టీం కూడా 85 నిమిషాల్లోగా 20 ఓవర్లు బౌల్ చేసే విధంగా కొత్త నిబంధన తీసుకొచ్చింది ఐసీసీ.

ఈ సమయం లోపు బౌలింగ్ ఫినిష్ చేయకపోతే పెనాల్టీ పడుతుంది.పెనాల్టీ ప్రకారం ఆలస్యంగా వేసే ప్రతి ఓవర్ కు 30 గజాల అవతల కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉంచాలి.

సాధారణంగా 30 గజాల అవతల ఐదుగురు ఫీల్డర్లు ఉంటారు.కానీ పెనాల్టీ వల్ల నలుగురిని మాత్రమే బయట ఉంచేలా చర్యలు తీసుకుంటారు.

దీనివల్ల బ్యాటింగ్ చేసే టీంకు అడ్వాంటేజ్ అవుతుంది.ఒక ఫీల్డర్ లేని చోట ఈజీగా సిక్సర్లు, ఫోర్లు చేసేందుకు బ్యాట్స్‌మెన్లకు సాధ్యమవుతుంది.

ఇది బౌలింగ్ టీంకి చాలా డేంజర్.అందుకే బౌలింగ్ టీమ్స్ కచ్చితంగా నిర్దిష్ట సమయంలోగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

ఇన్‌గేమ్ స్లో ఓవర్ రేట్ నిబంధన ప్రకారం, బౌలింగ్ వేసే జట్టు షెడ్యూల్ చేసిన సమయానికి తమ చివరి ఓవర్‌లో మొదటి బంతిని బౌల్ చేయాల్సి ఉంటుంది.ఒకవేళ షెడ్యూల్ సమయంలోగా లాస్ట్ ఓవర్ స్టార్ట్ చెయ్యని పక్షంలో పెనాల్టీ కింద 30 గజాల సర్కిల్ అవతల అనుమతించిన సంఖ్య కంటే ఒక ఫీల్డర్‌ను తక్కువ నియమించాల్సి ఉంటుంది.ఐతే ఈ కొత్త రూల్ చాలా షాకింగ్గా ఉందని కొందరు క్రికెటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube