ఘనంగా భర్త పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన వంటలక్క.. ఫోటోలు వైరల్!
TeluguStop.com
ప్రేమి విశ్వనాథ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ వంటలకు అంటే మాత్రం టక్కున నటి ప్రేమి విశ్వనాథ్ అందరికీ గుర్తుకు వస్తారు.
స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో దీప పాత్రలో నటించినటువంటి ఈమె వంటలక్కగా ఎంతో గుర్తింపు పొందారు.
ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ఈ కేరళ నటి ఇతర ఏ తెలుగు సీరియల్స్ లోను నటించలేదు.
కేవలం కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈ సీరియల్ లో దీప కార్తీక్ పాత్రలను తొలగించడంతో ఈ సీరియల్ రేటింగ్ అమాంతం పడిపోవడంతో చేసేదేమీ లేక ఈ సీరియల్ లోకి తిరిగి ఈ పాత్రలను తీసుకువచ్చారు.
అంతలా ఈ సినిమా ద్వారా ప్రేమి విశ్వనాథ్ ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు.ఇకపోతే సీరియల్ నటిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.
"""/"/
ఇక ఈ మధ్య కాలంలో ప్రేమి విశ్వనాధ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తన భర్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అనే విషయాన్ని ఇదివరకు దీప వెల్లడించారు.
తన భర్త పేరు డాక్టర్ వినీత్ భట్ అని ఆయనకు వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ గా పేరు ప్రఖ్యాతలు ఉండడమే కాకుండా వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ అవార్డును కూడా అందుకున్నారని తెలిపారు.
ఇక నవంబర్ 16వ తేదీ తన భర్త వినీత్ పుట్టినరోజు కావడంతో వంటలక్క పెద్ద ఎత్తున తన భర్త పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ వెనుక కారణాలివేనా.. ఈ లుక్ లో బాగున్నారంటూ?