అనుమానం పెనుభూతం అయిన వేళ.. మనిషి మృగంగా మారి.. !

ప్రస్తుతం మృగాలు అడవుల్లో లేవనిపిస్తుంది.లోకంలో మనుషుల ముసుగేసుకుని సంచరిస్తున్నట్లుగా కొన్ని ఘటనలు నిరూపిస్తున్నాయి.

 The Husband Who Strangled The Wife-TeluguStop.com

మానవత్వం మంటకలసిపోగా, విచక్షణ ఆవిరిగా మారిన వేళ మనుషులే తోడేళ్లకంటే దారుణంగా తోటి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు.ఇలాంటి ఘటన నిజామాబాద్ పట్టణంలోని ఐదవ టౌన్ పరిధి నాగారంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది.

ఆ వివరాలు చూస్తే.

 The Husband Who Strangled The Wife-అనుమానం పెనుభూతం అయిన వేళ.. మనిషి మృగంగా మారి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగారం 80 క్వార్టర్స్ కాలనీకి చెందిన షేహనాజ్ బేగం(30)ను భర్త షేక్ సల్మాన్ కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్యచేశాడు.

కాగా వీరిద్దరికి 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది.ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు కలిగిన భార్య పై సల్మాన్ అనుమానం పెంచుకోవడంతో తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవట.

దీంతో ఓపిక నశించిన షహనాజ్ రెండు నెలల కిందట పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత అందరు సర్దిచెప్పడంతో తిరిగి భర్తవద్దకు చేరిందట.

అయిన మారని సల్మాన్ అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి కత్తితో భార్య గొంతు కోశాడు.ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తీవ్ర రక్తస్రావం జరిగి షేహనాజ్ బేగం ప్రాణాలు కోల్పోయింది.

ఇక స్దానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్దలానికి చేరుకున్న పోలీసులు షేక్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

#Murder #Wife #Husband #Nagaram #Nizamabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు