మ‌ట‌న్ కావాలా నేను కావాలా అంటూ భార్య‌కు అల్టిమేటం జారీ చేసిన భ‌ర్త‌..

The Husband Who Issued The Ultimatum To His Wife For Mutton Details

పెండ్లి అన‌గానే చాలామంది చాలా ర‌కాలుగా ఆలోచిస్తుంటారు.ఎందుకంటే అబ్బాయికి ఉన్న అల‌వాట్లు అమ్మాయికి ఉండ‌క‌పోవ‌చ్చు, అమ్మాయికి ఉన్న అల‌వాట్లు అబ్బాయికి ఉండ‌క‌పోవచ్చు.

 The Husband Who Issued The Ultimatum To His Wife For Mutton Details-TeluguStop.com

మ‌రి వీరిద్ద‌రూ జీవితాంతం త‌మ త‌మ ఇష్టాల‌ను ఒకరి కోసం మ‌రొక‌రు వ‌దులుకుంటారా లేరా అన్న‌ది మాత్రం ఎప్ప‌టికీ ఎవ‌రికీ అర్థం కాదు.ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి చిన్న చిన్న కార‌ణాల‌తోనే విడిపోతున్నారు.

ఒక‌రికి ఒక‌ర‌క‌మైన వంట‌లు ఇష్ట‌ముంటే మ‌రోక‌రికి ఇంకొక ర‌క‌మైన వంట‌లు ఇష్ట‌ప‌డతారు.వీటిని పెద్ద కార‌ణాలుగా చూడాల్సిన అవ‌స‌రం లేదు.

 The Husband Who Issued The Ultimatum To His Wife For Mutton Details-మ‌ట‌న్ కావాలా నేను కావాలా అంటూ భార్య‌కు అల్టిమేటం జారీ చేసిన భ‌ర్త‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈరోజుల్లో విడిపోయే వారికి ఇవే పెద్ద కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి.విన‌డానికి కొంచెం ఆశ్చ‌ర్యంగా ఉందా.

అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే మాత్రం నిజ‌మే అని ఒప్పుకుంటారేమో.ఇప్పుడు మ‌నం చెప్పుకునే స్టోరీలో ఓ వ్య‌కి చిన్న‌ప్ప‌టి నుంచి ప్యూర్ వెజిటేరియన్.

కాగా అత‌ను ఓ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు.కాక‌పోతే ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచి మ‌ట‌న్ తినే అల‌వాటు ఉంది.

పెండ్లి త‌ర్వాత మ‌ట‌న్ తినోద్ద‌నే కండీష‌న్ మీద ఆమెను పెండ్లి చేసుకున్నాడు.ఇక ఆమె కూడా దీనికి ఒప్పుకుంది.

కానీ పెండ్లి అయిన త‌ర్వాత మాట త‌ప్పింది.

భ‌ర్త‌కు తెలియ‌కుండా నిత్యం బ‌య‌ట మ‌ట‌న్ తిన‌డం మొద‌లెట్టేసింది.అయితే ఓ రోజు ఈ విష‌యం భ‌ర్త‌కు తెలిసి విప‌రీత‌మైన కోపం తెచ్చుకున్నాడు.ఇక ఎన్ని సార్లు చెప్పినా భార్య త‌న ప‌ద్ధ‌తి మార్చుకోవ‌ట్లేద‌ని చివ‌ర‌కు ఓ అల్టిమేటం జారీ చేశాడు.

నీకు మటన్ కావాలా.నేను కావాలా తేల్చుకో అని తేల్చి చెప్పేశాడు.కాగా ఇక్క‌డే అత‌నికి మ‌రో డౌట్ కూడా వ‌చ్చింది.త‌న‌ను కాద‌ని మటన్‌ను కోరుకుంటే ప‌రువు పోతుంద‌ని భావించి ఫ్యామిలీ కౌన్సిలర్‌కు లెట‌ర్ రాశాడు.ఇక అత‌ను కూడా ఓకే అన‌డంతో ఈ అల్టిమేటంను జారీ చేశాడు.అయితే అమ్మాయి ఆన్స‌ర్ ఏంటో ఇంకా తెలియ‌లేదు.

#Letter #Mutton #Pure Veg #Counsilor #Mutton

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube