వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే కళ్ళముందు కొట్టుకుపోయిన భారీ వంతెన..!

అసలే కరోనాతో జనం బిక్కుబిక్కు మంటూ ఉంటే దానికి తోడు ఇప్పడు వర్షాలు కూడా దంచి కొడుతున్నాయి.భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

 The Huge Bridge That Was Washed Away Before Everyone's Eyes Viral Video, Viral L-TeluguStop.com

మధ్యప్రదేశ్‌ లో కూడా భారీగా వర్షాలు కురిశాయి.వరదల వల్ల చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు.

కొందరు ప్రాణాలను విడిచారు.వర్షం కారణంగా అనేక పెద్ద పెద్ద భవనాలు సైతం కొన్ని నేలకూలాయి.

రెండు పెద్ద బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతం మొత్తం చిన్నాభిన్నమైంది.భారీ వర్షానికి దాటియా ప్రాంతానికి దగ్గరలో సింధ్ నదిపైన ఓ బ్రిడ్జి కొట్టుకుపోయిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు.

ఆ బ్రిడ్జిలు వరదలకు కొట్టుకుపోయే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.వీడియోలో సింధ్ నదిపై వేగంగా వరదలు ఎక్కువయ్యాయి.

వరదల వలన వంతెన కూలిపోయింది.

అల్పపీడన ప్రభావం వలన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వరదలు పొటెత్తడంతో ప్రజలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.భారీ వర్షానికి అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి.

సింధ్ నది కూడా వర్షపు వరదలకు తీవ్రంగా చిన్నాభిన్నమైంది.ఆ నదిపైన శివపురి జిల్లాలో నిర్మించిన అటల్ సాగర్ మడిఖేడ ప్రాజెక్టు అనేది ఉంది.

ఆ నది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు అప్రమత్తమై పది గేట్లను ఎత్తేశారు.నీటిని వదలడం వలన ప్రవాహం ఉప్పొంగుతోంది.

సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్వాలియర్ – చంబల్ ప్రాంతంలో కూడా ఏకధాటిగా వానలు పడుతున్నాయి.

షియోపూర్, శివపురి జిల్లాల్లో చాలా వరకూ అన్ని ప్రాంతాలు కూడా నీటితో మునిగిపోయాయి.

Telugu Bridge Clash, Madhya Pradesh, Meida, Latest-Latest News - Telugu

సర్కార్ వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించి సహాయక చర్యలను చేపడుతోంది.ఇటువంటి వానలకు పెద్ద పెద్ద భవనాలు, వంతెనలు కూలిపోవడం సహజం.అయితే ఇక్కడ కూడా రెండు వంతెన కూలిపోయాయి.

దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube