సినిమా ట్రైలర్స్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా.? వెనకున్న కథ ఇదే.!  

The History Of The Movie Trailer-movie Trailer History,nils Granlund

ఇప్పుడంటే సినిమాల‌కు చెందిన ట్రెయిల‌ర్స్‌ను మ‌నం యూట్యూబ్‌లోనే చూస్తున్నాం. కానీ ఒక‌ప్పుడు వాటిని థియేట‌ర్స్‌లో వేసేవారు. మొద‌ట వాటిలోనే ట్రెయిల‌ర్స్‌ను వేయ‌డం ప్రారంభం అయింది..

సినిమా ట్రైలర్స్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా.? వెనకున్న కథ ఇదే.!-The History Of The Movie Trailer

అయితే మీకు తెలుసా.? ప‌్ర‌స్తుతం సినిమా థియేట‌ర్స్‌లో ఇంట‌ర్వెల్‌లో ప‌లు సినిమాల‌కు చెందిన ట్రెయిల‌ర్స్‌ను వేస్తున్నారు కానీ, ఒక‌ప్పుడు సినిమా అయ్యాక వాటిని వేసేవారు.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అందుకే వాటికి ట్రెయిల‌ర్స్ అని పేరు వ‌చ్చింది. అయితే ఇలా సినిమా షో అయ్యాక ట్రెయిల‌ర్స్ వేయ‌డం అనే ట్రెండ్ ఎప్పుడు ప్రారంభం అయిందో తెలుసా.

?

అది 1913వ సంవ‌త్స‌రం. న‌వంబ‌ర్ నెల‌. నిల్స్ గ్రాన్‌లండ్ అనే వ్య‌క్తి ఒక విప్ల‌వాత్మ‌క‌మైన ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చాడు.

అప్ప‌ట్లో సినిమాల క‌న్నా మ్యూజిక‌ల్ షోలు, నాట‌కాలు వంటి వాటిని జ‌నాలు ఎక్కువ‌గా చూసేవారు. ఒక థియేట‌ర్ హాల్‌లో రోజు మొత్తంలో భిన్న‌మైన షోలు వేసేవారు. అయితే షోకు, షోకు మ‌ధ్య చాలా స‌మ‌యం ఉండేది..

దీంతో హాల్‌లో కూర్చున్న వీక్ష‌కులు విసుగు చెందేవారు. ఇదే నిల్స్ గ్రాన్‌లండ్ మ‌దిలో ఆలోచ‌న‌ను రేకెత్తింది. త‌న మ్యూజిక‌ల్ షోకు చెందిన రిహార్స‌ల్ క్లిప్‌ల‌ను జ‌త చేసి అత‌ను ప‌లు షోలు ముగింపు అయ్యాక వాటిని ట్రెయిల‌ర్స్‌లా వేశాడు.

దీంతో అత‌ని మ్యూజిక‌ల్ షోల‌కు అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్ బాగా ల‌భించేది. అలా ట్రెయిల‌ర్స్‌ను అంద‌రూ వేయ‌డం స్టార్ట్ చేశారు.

అయితే ఇలా ట్రెయిల‌ర్స్ ను త‌యారు చేసి ఇవ్వ‌డం కోసం 1916లో నేష‌న‌ల్ స్క్రీన్ స‌ర్వీస్ అనే సంస్థ ఏర్పాటైంది. అయితే నిల్స్ గ్రాన్‌లండ్ మాత్రం త‌న షోల‌తోపాటు ఇత‌ర షోలకు కూడా ట్రెయిల‌ర్స్ త‌యారు చేసి ఇచ్చేవాడు.

ఆ త‌రువాత నెమ్మదిగా సినిమా నిర్మాత‌లు కూడా ట్రెయిల‌ర్స్ వేయ‌డం ప్రారంభించారు. ఇక నిల్స్ గ్రాన్‌లండ్ కూడా సినిమా ట్రైల‌ర్ల‌ను చేసి ఇచ్చేవాడు. ఆ త‌రువాత అత‌ను చార్లీ చాప్లిన్ సినిమాల‌కు ట్రైల‌ర్స్‌ను త‌యారు చేసి ఇచ్చాడు..

కాగా 1960లో నేష‌న‌ల్ స్క్రీన్ స‌ర్వీస్ సంస్థను మూసేశారు. ఎందుకంటే అప్ప‌టికే హాలీవుడ్‌లో పాతుకుపోయిన బ‌డా నిర్మాణ సంస్థ‌లు మొద‌లుకొని చిన్న నిర్మాత‌లు కూడా త‌మ సినిమాల‌కు తామే సొంతంగా ట్రైల‌ర్స్‌ను త‌యారు చేసుకోవ‌డం మొద‌లు పెట్టారు. అది నేటికీ కొన‌సాగుతూ వ‌స్తోంది. కాక‌పోతే అప్పట్లో సినిమా చివ‌ర్లో వేసే ట్రైల‌ర్స్‌ను ఇప్పుడు ఇంట‌ర్వెల్‌లో వేస్తున్నారు.

అంతే తేడా.! సినిమా చివ‌ర్ల‌లో వేసే వారు కాబ‌ట్టే వాటిని ట్రైల‌ర్స్ అంటూ పిలుస్తూ వ‌స్తున్నారు..

ఇదీ… ట్రైల‌ర్స్ వెనుక ఉన్న స్టోరీ.!