శాంటాక్లాజ్‌ అంటే ఎవరు? క్రిస్మస్‌కు ఆయన గిఫ్ట్‌లు ఇవ్వడం నిజమేనా?

క్రిస్మస్‌ సందడి మొదలైంది.ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రిస్మస్‌ వేడుకలో ఘనంగా జరుపుకుంటున్నారు.

 The History Of Santa Claus Interesting Facts About Him-TeluguStop.com

ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్ని తాకుతాయి.క్రిస్మస్‌ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది క్రిస్మస్‌ ట్రీ, స్టార్‌ మరియు శాంటాక్లాజ్‌.

సినిమాలు మరియు సోషల్‌ మీడియా ప్రభావం ఏమో కాని క్రిస్మస్‌ సీజన్‌ ప్రారంభం అవ్వగానే ఎక్కడ చూసినా కూడా ఈ మూడు కనిపిస్తూనే ఉంటాయి.అయితే శాంటాక్లాజ్‌ గురించిన ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

Telugu Jesuschristiyan, Santa Claus, Santaclaus-

క్రిస్మస్‌ అంటే శాంటాక్లాజ్‌ వచ్చి గిఫ్ట్‌లు ఇస్తాడు అంటారు.చిన్న పిల్లలతో పాటు పెద్ద వారికి కూడా గిఫ్ట్‌లు ఇవ్వడం, కోరిన కోర్కెలు తీర్చడం శాంటా పని అంటారు.ఏసు పుట్టిన రోజునే శాంటా ఎందుకు ఈ గిఫ్ట్‌లు ఇస్తాడు అనే విషయంపై ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.శాంటా క్లాజ్‌ అనే వ్యక్తి ఉన్నాడా లేడా అనేది కూడా తెలియదు.

ఇప్పుడు అయితే ఖచ్చితంగా లేడు.గతంలో అయినా ఉన్నాడా, శాంటా దైవ స్వరూపమా లేదంటే ఏసు సేవకుడా అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి.

Telugu Jesuschristiyan, Santa Claus, Santaclaus-

క్రిస్టియన్‌ పెద్దలు చెబుతున్న విషయం ఏంటీ అంటే జీసస్‌కు శాంటాకు అసలు సంబంధం లేదు.మూడవ శతాబ్దం వ్యక్తి శాంటా అని, ఏసు జీవితంకు శాంట జీవితంకు కాస్త దగ్గర పోలికలు ఉంటాయని వారు అంటున్నారు.ఏసు పుట్టిన రోజున శాంటా గిఫ్ట్‌లు ఇవ్వడం అనేద కూడా కొందరు కల్పించిందే అని వారు అంటున్నారు.పిల్లలను ఆనందపర్చే ఉద్దేశ్యంతో మత పెద్దలు కూడా ఆ విషయాన్ని చూసి చూడనట్లుగా వదిలేశారని అంటున్నారు.

మంచి మనసున్న వారు ఇప్పుడు కూడా శాంటా వేశంలో వచ్చి పేద పిల్లలకు గిఫ్ట్‌లు ఇవ్వడం జరుగుతుంది.చిన్నారుల సంతోషంను కాదనడం ఎందుకని క్రిస్టియన్స్‌ శాంటి ఆనవాయితిని కొనసాగిస్తున్నట్లుగా క్రైస్తవ మత బోధకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube