భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఏడవ రోజుకు చేరుకుంది.

భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఏడవ రోజుకు చేరుకుంది.ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లో చేపట్టిన పాదయాత్ర పెద్దమండవ లో సాగుతోంది.

 The Hiking Undertaken By Bhatti Vikramarka Reached Its Seventh Day , Bhatti Vikr-TeluguStop.com

ఈ పాదయాత్ర లో సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు.గ్రామంలో పాదయాత్ర అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం అయ్యే వరకూ పీపుల్స్ మార్చ్ కొనసాగుతుందన్నారు.

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు.తెలంగాణ ప్రజల సొమ్ము ప్రగతి భవన్ లో ఉందని దాన్ని గేట్లను బద్దలు కొట్టి ప్రజలకు పంచుతామన్నారు.

రైతులను వరి సాగు చేస్తే ఉరి వేస్తామన్న కేసీఆర్ కు రైతులు ఉరి వేసేందుకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు,పెన్షన్లు,మహిళలకు రుణాలు రావడం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భట్టి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube