అఖండ సినిమాలోని ఈ గిత్తలు ఎవరివో వాటి ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?

The Highlight Of Akhanda Bulls Is The Speciality Of Krishnarjuna

స్టార్ హీరో బాలయ్య నటించిన అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.మరికొన్ని రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అఖండ మూవీ హవా కొనసాగనుంది.

 The Highlight Of Akhanda Bulls Is The Speciality Of Krishnarjuna-TeluguStop.com

మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్లలో అఖండ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.సినిమాలో ఎద్దుల ఫైటింగ్ సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

గిత్తలతో హీరో ఎంట్రీ అదుర్స్ అనిపించేలా ఉండగా ఈ గిత్తల గురించి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది.

 The Highlight Of Akhanda Bulls Is The Speciality Of Krishnarjuna-అఖండ సినిమాలోని ఈ గిత్తలు ఎవరివో వాటి ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలో కనిపించిన ఎద్దులు చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ అనే వ్యక్తివి కావడం గమనార్హం.

నూనె శ్రీనివాస్ తన పొలంలో గోశాలను ఏర్పాటు చేసి అందులో ఆవులు, ఎద్దులను పెంచుకుంటున్నాడు.రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఈ గిత్తలకు నూనె శ్రీనివాస్ కృష్ణుడు, అర్జునుడు అని పేర్లు పెట్టుకున్నారు.

శ్రీనివాస్ ఆ ఎద్దులకు వేర్వేరు అంశాల గురించి శిక్షణ ఇచ్చారు.

గతేడాది శ్రీనివాస్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిన సమయంలో అక్కడ శ్రీనివాస్ అఖండ మేకర్స్ కు తన ఎద్దులకు సంబంధించిన వీడియోలను చూపించారు.

Telugu Akhanda, Akhanda Bulla, Block Buster, Bock Buster, Boyapati Srinu, Bulls Akhanda, Balakrishna, Krishnaarjuna, Nune Srinivas, Pragya Jaiswal, Thaman-Movie

ఆ తర్వాత అఖండ మేకర్స్ రెండు రోజుల పాటు ఎద్దులకు సంబంధించి షూటింగ్ చేశారు.సినిమాలో స్టార్టింగ్ సీన్ తో పాటు క్లైమాక్స్ సీన్ లో కూడా ఎద్దులు కనిపిస్తాయి.బాలయ్య సినిమాలో నటించడంతో ఆ ఎద్దులకు ఊహించని స్థాయిలో గుర్తింపు వచ్చింది.

Telugu Akhanda, Akhanda Bulla, Block Buster, Bock Buster, Boyapati Srinu, Bulls Akhanda, Balakrishna, Krishnaarjuna, Nune Srinivas, Pragya Jaiswal, Thaman-Movie

ఈ ఎద్దులకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అఖండ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించింది.హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ బాగుందని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

#Akhanda #Boyapati Srinu #Nune Srinivas #Pragya Jaiswal #Bock Buster

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube