ఓవర్ లోడింగ్ బస్సుకు షాకిచ్చిన హై టెన్షన్ పవర్.. కానీ.. ?

సంగారెడ్డి జిల్లాలో ఒక బస్సుకు పెను ప్రమాదం తప్పింది.ఆ సమయంలో ఆ బస్సులో సుమారుగా 110 మంది వరకు ఉన్నారట.

 The-high Tension Power That Shocked The Overloading Bus Sangareddy, Muni Palli,-TeluguStop.com

ఇక వీరందరిని ప్రాణాపాయం నుండి కాపాడింది ఓవర్ లోడ్ అని తెలుస్తుంది.

ఇక అసలు విషయం తెలుసుకుంటే.

సంగారెడ్డి జిల్లా ముని పల్లి మండలానికి సంబంధించి చదువుకునే పిల్లలు అంతా ఆర్టీసీ బస్ లో సదా శివ పేట స్కూల్స్, కాలేజ్ లకు వెళ్తుంటారు, అయితే రోజు మాదిరిగానే ఈ స్టూడెంట్స్ అంతా బస్సులో కిక్కిరిసిపోయారట.కాగా ఆ బస్ డ్రైవర్ మునిపల్లి ఊర్లో నే యూ టర్న్ తీసుకునే ప్రయత్నం చేయగా, ఆ గ్రామంలో క్రిందకు వ్రేలాడుతున్న విద్యుత్ టెన్షన్ వైర్ లు బస్సు మీదపడగా అందులో ఉన్న వారంత కరెంట్ షాక్ కి గురి అయ్యారట.

అయితే డోర్ దగ్గర ఉన్న గీత, నరసింహ, జగన్ అనే ముగ్గురు కి తీవ్ర గాయాలు అయ్యాయి, మిగతా వారందరు ప్రమాదం నుంచి సేఫ్ గా బయట పడ్డారని సమాచారం.ఇలా పెనుప్రమాదం సంభవించక పోవడానికి కారణం ఓవర్ లోడ్ అని అంటున్నారు అధికారులు.

ఇంత మంది బస్సులో ఉండడం వల్ల అందరికీ కరెంట్ ఎఫెక్ట్ ఎక్కువగా పడలేదట.ఒక వేళ జరగరానిది ఏదైనా జరిగితే ఆ 110 మందిలో బ్రతికేవారు ఎందరో ఆ దేవునికే తెలియాలంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube