పెళ్ళైన ఆరునెలలకే విడాకులు తీసుకుంటున్న హీరోయిన్!

సిని ఇండస్ట్రీకి చెందిన నటులకు పెళ్లి యొక్క విలువ చాలా వరకు తెలియదనే చెప్పాలి.ఎందుకంటే తమకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు.

 The Heroine Who Is Gettig Divorced After Six Years Of Marriage-TeluguStop.com

నచ్చనప్పుడు వదిలించుకుంటారు.అలా చాలా మంది సెలబ్రెటీలు తమ పెళ్లిళ్ల విషయంలో ఎక్కువగా బ్రేకప్ చెప్పినవాలే ఉన్నారు.

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో కూడా తన భార్యకు విడాకులు ఇవ్వగా.తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులకు సిద్ధమైంది.

 The Heroine Who Is Gettig Divorced After Six Years Of Marriage-పెళ్ళైన ఆరునెలలకే విడాకులు తీసుకుంటున్న హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.

తెలుగు సినీ నటి సంజన గల్రాని.

మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని వెండితెరపై పరిచయమైంది.తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నటించింది.బుల్లితెరపై కూడా నటించి తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది.‘సోగ్గాడు’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సంజన ఆ తర్వాత ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో నటించింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తన పెళ్లయిన ఆరు నెలలకే విడాకులకు ముందుకొచ్చింది.

కొన్ని రోజుల కిందట కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త, డాక్టర్ పాషా అనే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి.

ఎవరికి తెలియకుండా అతి తక్కువ మంది సమక్షంలో సీక్రెట్ పెళ్లి చేసుకుంది.వీరి పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.ఇక వీరి పెళ్లి జరిగిన ఆరు నెలలకే విడాకులు తీసుకోవడానికి సిద్ధమైంది.కారణం తన భర్తతో తనకు విభేదాలు ఎక్కువగా రావడంతో వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

వీరికి కౌన్సిలింగ్ ఇప్పించిన కూడా మార్పు మాత్రం లేదని తెలుస్తుంది.ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ.

ఈ విషయం గురించి తెలియాలంటే సంజనా చెప్పే వరకు ఆగాల్సిందే.

Telugu Bollywood, Dr Prasane, Drugs Case, Etweet, Karntaka Court, Kollywood News, Sanjana Galrani-Movie

ఇక పెళ్లి కంటే ముందు గతేడాది కొన్ని డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.ఇక ఈమె ఆరోగ్యం పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు కర్ణాటక హైకోర్టు.ఇక ఆ మధ్య ఈ విషయం గురించి సోషల్ మీడియాలో బాగా ప్రచారం కూడా జరిగింది.

ఆ తర్వాత పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇవ్వగా.మళ్లీ ఇప్పుడు విడాకుల మాటతో పెద్ద షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.

#Sanjana Galrani #Drugs Case #Karntaka Court #Dr Prasane #Etweet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు