రాజా ది గ్రేట్ మూవీ మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న టాప్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు.అనిల్ రావిపూడి కథనం, మాటలు ఇచ్చి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన గాలిసంపత్ సినిమా శివరాత్రి పండుగ కానుకగా థియేటర్లలో విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకొంది.

 The Hero Who Missed Chance In Raja The Great Movie-TeluguStop.com

అయితే కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.గాలిసంపత్ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న అనిల్ రావిపూడి కీలక విషయాలను వెల్లడించారు.

గాలిసంపత్ కథను మొదట విన్న సమయంలోనే రాజేంద్రప్రసాద్ ను తండ్రిపాత్రకు అనుకున్నామని శ్రీవిష్ణు కొడుకు పాత్రకు సరిపోతాడని అనిపించి అతనిని ఎంపిక చేశామని తెలిపారు.ఈవీవీ సత్యనారాయణ, జంధ్యాల లాంటి డైరెక్టర్లు సినిమాల్లో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకునేవాళ్లని అనిల్ రావిపూడి తెలిపారు.

బాబాయ్ అరుణ్ ప్రసాద్ తమ్ముడు, గౌతమ్ ఎస్.ఎస్.సీ సినిమాలు తెరకెక్కించారని ప్రస్తుతం అరుణ్ ప్రసాద్ బిజినెస్ చేస్తున్నారని అనిల్ రావిపూడి అన్నారు.

Telugu Anil Ravipudi, Gali Sampath, Ram, Raja-Movie

చాలా సినిమాలకు తాను డైలాగ్ రైటర్ గా పని చేశానని రైటర్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా రైటర్ గా పని చేసిన హీరోలతోనే డైరెక్టర్ గా కూడా పని చేసి విజయాలను అందుకున్నానని అనిల్ రావిపూడి వెల్లడించారు.రవితేజతో తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా గురించి చెబుతూ ఈ సినిమాను మొదట రామ్ తో తెరకెక్కించాలని అనుకున్నానని కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రామ్ తో తెరకెక్కించలేదని అనిల్ రావిపూడి చెప్పారు.

చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ డ్యాన్స్ చేసేవాడినని ఈవెంట్ లో ఎప్పుడైనా డ్యాన్స్ చేయాలని ఉందని అనిల్ రావిపూడి అన్నారు.

బాగా కొరియోగ్రఫీ నేర్చుకుని ఏదైనా ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తానని అనిల్ రావిపూడి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube