పేరు కన్ఫ్యూజన్ తో బాలీవుడ్ లో అవకాశం దక్కించుకున్న హీరో!

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ద బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు పొందిన నవీన్ పొలిశెట్టి ఇటీవల విడుదలైన జాతి రత్నాలతో ఓ రేంజ్ లో గుర్తింపు అందుకున్నాడు.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

 Naveen Polishetty Got Bollywood Chance By Name Confusion , Naveen Polishetty, B-TeluguStop.com

ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి యంగ్ స్టార్ గా ఎదిగాడు.

అనుదీప్ కె.వి దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన సినిమా జాతి రత్నాలు.ఇక ఈ సినిమా నవీన్ పొలిశెట్టి సరసన అబ్దుల్లా ఫరియా హీరోయిన్ గా నటించింది.

ఇక ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు కూడా ప్రధాన పాత్రలో నటించగా.ఈ సినిమాలో వీరి కామెడీ తెగ పండింది.ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత నవీన్ పొలిశెట్టి ఆఫర్లు కూడా వస్తున్నాయి.ఇదిలా ఉంటే కేవలం పేరు బాలీవుడ్ లో అవకాశం దక్కించుకున్నాడు నవీన్.

తాజాగా నవీన్ పొలిశెట్టి, అనుదీప్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నగా వారి గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే నవీన్ పొలిశెట్టి తన గురించి కొన్ని విషయాలు పరిచయం చేస్తూ.

ఈ సినిమా విజయం గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.హిందీ సినిమాకు యాక్టర్ నవీన్ కు మెయిల్ చేస్తే.

ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశం అందుకున్నాడు.

Telugu Alitho Saradaga, Anudeep Kv, Bollywood, Chichhore, Jathi Ratnalu, Mukesh

తాను నెల్లూరులో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ షూటింగ్ లో ఉన్నప్పుడు.అప్పటికి ఆయన యూట్యూబ్ లో ఐదారేళ్లు హిందీ లో వీడియోలు చేశాడట.అయితే బాంబేలో ముఖేష్ చాబ్రా అని ఆడిషన్ కాస్ట్ డైరెక్టర్ ఉండగా.

ఆయన ఆఫీసులో తనదే రికార్డ్ అట.ఇక ఆఫీసులో 56 రిజెక్టెడ్ ఆడిషన్స్ తనవే ఉన్నాయట.ఇక అన్ని ఏళ్లుగా ఆడిషన్స్ ఇచ్చేసరికి తన పేరు గుర్తుండిపోయిందని తెలిపారు.

ఇక బాలీవుడ్ దంగల్ డైరెక్టర్ ‘చిచోరే‘ సినిమాలో ఒక లీడ్ క్యారెక్టర్ కోసం.

మలయాళ యాక్టర్ నివిన్ పౌలి ఆడిషన్ కోసం ఆయనకు ఫోన్ చేశారట.కానీ అక్కడే నవీన్ పొలిశెట్టి మలుపు తిరిగింది.

ఎందుకంటే పొరపాటున ఆ డైరెక్టర్ నవీన్ కు ఫోన్ చేశారట.ఇక తనను ఆడిషన్ చేసి పంపారట.

ఇక అక్కడ నవీన్ ఆడిషన్ చూసి షాక్ అయ్యి వాళ్ళ మధ్య జరిగిన మిస్ కమ్యూనికేషన్ క్లియర్ చేసుకున్నాడట ఆ డైరెక్టర్.

ఇక నాలుగు నెలల తర్వాత యూట్యూబ్ లో వైరల్ అయినా తన వీడియో చూసి మళ్లీ ఆ డైరెక్టరే.

నవీన్ కు ఫోన్ చేసి చిచోరే లో అవకాశం ఇచ్చాడట.మొత్తానికి పేరు కన్ఫ్యూజ్ వల్ల నవీన్ కు హిందీ లో అవకాశం వచ్చింది.ఇప్పుడు హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని నవీన్ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube